Uttam vs KCR: కేసీఆర్ ఆడిన నాటకం అది.. ఉత్తమ్‌ షాకింగ్‌ కామెంట్స్!

తెలంగాణ వచ్చింది కేసీఆర్‌ వల్ల కాదని.. చిదంబరం వల్లేనని ఉత్తమ్ చెప్పారు. తెలంగాణలో ఓట్లను ప్రభావితం చేయడానికి ఓటింగ్ డే నాడు జగన్‌తో మాట్లాడి CRPFని సాగర్ డ్యాం మీదకు పంపి కుట్ర చేశారన్నారు. రాజకీయంగా కుట్ర చేయడానికి ఇది కేసీఆర్‌ ఆడిన నాటకమని విమర్శించారు ఉత్తమ్.

UttamKumarreddy : ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన..!
New Update

Uttam on KCR: బీఆర్‌ఎస్‌పై తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి చాలా అబద్ధాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ ఏర్పడ్డాకే కృష్ణ నీటిలో తెలంగాణకి ఎక్కువ అన్యాయం జరిగిందని ఆరోపించారు. వీళ్ళ పరిపాలన అసమర్థత వల్లనే కృష్ణ జల్లాలో రైతులకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఏ ప్రతిపదికన తీసుకున్నా వీళ్ళు చేసింది తప్పేనన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆన్‌రికార్డ్స్‌లో కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడానికి ఒప్పుకొని మెయింటెనెన్స్ కింద 200 కోట్లు కేటాయిస్తున్నట్టుగా పేర్కొన్నారు

10ఏళ్ళలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు:

కృష్ణా రివర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఇవ్వడానికి 56 రోజుల పాలనలో మేము ఎక్కడా ఒప్పుకోలేదన్నారు ఉత్తమ్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఒక్క ప్రాజెక్ట్ కూడా 10ఏళ్ళ లో పూర్తి చేయలేదని బీఆర్‌ఎస్‌పై ఫైర్ అయ్యారు ఉత్తమ్. తెలంగాణలో నీటి కేటాయింపుల్లో మోసం, కేఆర్‌ఎంబీకి ప్రాజెక్ట్ లు ఇచ్చింది బీఆర్ఎస్ వాళ్లేనన్నారు. బీఆర్ఎస్ పార్టీ గ్రావిటీ ద్వారా రావలసిన ఎనిమిది టీఎంసీల కృష్ణా జలాల నీటిని కేసిఆర్, జగన్ ఏకాంతంగా మాట్లాడుకుని ఏపీకి అప్పగించారని ఆరోపించారు. మేము KRMBకి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులు ఇవ్వడానికి ఒప్పుకోమన్నారు. తెలంగాణ వచ్చింది వీళ్ళ(కేసీఆర్‌) వల్ల కాదు చిదంబరం కేంద్రంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒప్పించడం వల్లేనని తెలిపారు

కేసీఆర్ తెలంగాణలో ఓట్లను ప్రభావితం చేయడానికి ఓటింగ్ డే నాడు జగన్‌తో మాట్లాడి CRPFని నాగార్జున సాగర్ డ్యాం మీదకు పంపి కుట్ర చేశారన్నారు. రాజకీయంగా కుట్ర చేయడానికి ఇది కేసీఆర్‌ ఆడిన నాటకమని విమర్శించారు ఉత్తమ్.

Also Read: టీడీపీ, జనసేన మధ్య తేలని సీట్ల లెక్క.. ఈ స్థానాల్లో తీవ్ర పోటి!

WATCH:

#kcr #congress #uttam-kumar-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe