Uttam: అధికారంలోకి వస్తాం..!కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుంది: ఉత్తమ్ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. తెలంగాణపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేస్తూ ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటోంది కాంగ్రెస్. దీంపై ఉత్తమ్ స్పందిస్తూ బీఆర్ఎస్ పై పలు విమర్శలు చేశారు. By Vijaya Nimma 30 Aug 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి గద్దె దించుతాం... ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్. బీఆర్ఎస్‌పై ప్రజలకు విపరీతమైన కోపం ఉందని ఉత్తమ్ అన్నారు. అహంకారం అనేది బీఆర్ఎస్‌కు పెద్ద శత్రువు అదే వారిని గద్దె దించబోతోదన్నారు. అవినీతి విషయంలో కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు పర్మిషన్ ఇచ్చినట్లు ఉందన్నారు. టికెట్లు తొందరగా ప్రకటిస్తే మేము ప్రచార వేగం పెంచుతాం..! లెఫ్ట్ పార్టీలతో చర్చలు ఏ స్టేజ్‌లో ఉన్నాయో తెలియదు.. హుజూర్‌నగర్, కోదాడలో 50 వేల మెజారిటీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటున్నారు. పార్టీ పోటీ చేయోద్దంటే చేయను. ఎంపీ ప్రతిపాధన వస్తే అప్పుడు చూద్దాం అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి . ఒక్క అంశంపై ఎన్నికలు జరగవు. పార్టీ మ్యానిఫెస్టో, అభ్యర్థుల గుణగణాలు లెక్కలోకి వస్తాయి అంటున్నారు. గత 6 నెలల్లో పార్టీ చాలా బలపడింది. ఇంక అంగ, అర్థ బలంలో బీఆర్ఎస్‌ను దీటుగా ఎదుర్కుంటాం అని దీమ వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం, నల్లగొండలో క్లీన్ స్విప్ చేస్తాం అంటున్నారు. పీఈసీ సమావేశంలో ఎటువంటి గొడవ జరగలేదు.. ఏదో గొడవ జరిగిందనే తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత దోపిడీ ఎప్పుడూ చూడలేదు తెలంగాణలో ఎన్నిక సమీపిస్తున్నందున బీఆర్ఎస్‌తో పాటు.. కాంగ్రెస్, బీజేపీలో చాలా వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గాంధీ భవన్‌లో పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.మొదట కోమటిరెడ్డి సీట్ గురించి స్పందిచిన ఉత్తమ్.. తన సీట్ త్యాగం చేస్తానని చెప్పిన విషయం నాకు తెలియదన్నారు.ఇంత దిగజారుడు ప్రభుత్వం, ఇంత దోపిడీ గతంలో ఎప్పుడూ చూడలేదని విమర్శిలు గుప్పించారు. ఎమ్మెల్యేలు ప్రజలని హింసిస్తున్నారని..లెఫ్ట్ పార్టీలతో పొత్తు కోసం చర్చలు జరుపుతున్నట్లు నాకు తెలియదని ఆయన అన్నారు. బాల్క సుమన్‌కి కూడా నేను సమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ విషయాలు ఇంకా పట్టించుకుంటున్నారా? అంటూ నిలదిశారు. బండి సంజయ్ మా గురించి మాట్లాడడం పక్కన పెట్టి...కిషన్‌రెడ్డికి, ఈటలతో ఆయనకున్న పంచాయితీ గూర్చి మాట్లాడుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. టికెట్లు త్వరగా ప్రకటించాలని కోరుతున్నాను అని ఉత్తమ్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ మొదటి సారిగా గృహలక్ష్మి పథకం ప్రారంభించింది. తాజాగా గృహలక్షి పథకాన్ని ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఈ కార్యక్రమంలో రాహుంల్‌గాంధీ, సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గేతో కలిసి ప్రారంభించారు. కర్ణాటక ప్రభుత్వంపై కేసీఆర్ మాట్లాడిన మాటలు ఖండిస్తున్నా అని ఉత్తమ్ అన్నారు. కర్ణాటకలో 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని..మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామన్నారు. అంతేకాకుండా ఈరోజు నుంచి గృహలక్ష్మి పాలసీలో భాగంగా ప్రతి మహిళకి 2000 రూపాయలు ఇస్తున్నామన్నారు. అన్నభాగ్య స్కీమ్ కింద పది కిలోల బియ్యం అమలు చేస్తున్నామన్నారు. ఐదు గ్యారెంటీ స్కీమ్‌లలో నాలుగు పథకాలను అమలుచేస్తున్నామన్నారు. వచ్చే నెలలో ఇంకో పథకం కూడా ప్రారంభిస్తామని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మోసం చేశారు. దళితుడ్ని ముఖ్యమంత్రి, రెండు బెడ్ రూం ఇండ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, నిరుద్యోగ భృతి ఇలా ఏ ఒక్క వాగ్ధానాన్ని కేసీఆర్ అమలు పరచలేదని ఉత్తమ్ మండిపడ్డారు. కేసీఆర్ ఏ కలలోనైనా బ్రతకవచ్చు.మేం మాత్రం అధికారంలోకి వస్తాం..కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోతోందని ఉత్తమ్ ఘాటుగా కామెంట్స్ చేశారు. #cm-kcr #uttam-kumar-reddy #harsh-comments-on-brs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి