Skin Care: ఈ సోంపును ఉపయోగిస్తే టానింగ్ సమస్య తీరుతుందా? మీ చర్మం మెరుస్తుందా?

సోంపు నీళ్లను ముఖానికి రాసుకుంటే ముఖంలోని టానింగ్ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. సోంపు గింజలు, తేనె, పెరుగు కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచి ఆపై నీటితో ముఖాన్ని కడగాలి.

New Update
Skin Care: ఈ సోంపును ఉపయోగిస్తే టానింగ్ సమస్య తీరుతుందా? మీ చర్మం మెరుస్తుందా?

Skin Care Tips: ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి ఈ చిన్న వస్తువును ఉపయోగించవచ్చు. ఆహారం రుచిని మెరుగుపరచడమే కాకుండా.. సోంపు ముఖానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సోంపును ఉపయోగించడం ద్వారా టానింగ్ నుంచి బయటపడవచ్చు. దీనిని వడటం వలన కొన్ని రోజుల్లో చర్మం మెరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా చర్మాన్ని అందంగా మార్చుకోవాలనుకుంటే.. సోంపును ఉపయోగించవచ్చు. ఇది ముఖం కాంతివంతంగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. సోంపుతో టానింగ్‌ ఎలా పోతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

సోపుతో ముఖంలోని టానింగ్‌ తొలిగిపోయే చిట్కాలు:

  • సోంపు నీళ్లను ముఖానికి రాసుకుంటే ముఖంలోని టానింగ్ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
  • ఒక చెంచా ఫెన్నెల్, రెండు చెంచాల ఓట్ మీల్, నీటిని కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై 20 నిమిషాల పాటు అప్లై చేసి తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలి.
  • రెండు చెంచాల సోంపు గింజలు, ఒక చెంచా తేనె, ఒక చెంచా పెరుగు కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచి ఆపై నీటితో ముఖాన్ని కడగాలి.
  • ఇలా అన్ని విధాలుగా సోపుని ఉపయోగించి ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు.
  • ఫెన్నెల్ ఉపయోగించే ముందు, ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఎందుకంటే కొంతమందికి ఇది అలెర్జీ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మీ నోటి నుంచి దుర్వాసన వస్తుందా? సమస్యను ఇలా సాల్వ్ చేసుకోండి!

Advertisment
తాజా కథనాలు