బ్యూటీపార్లర్‌కి వెళ్తున్నారా? ఇది తెలుసుకోకపోతే మీ కళ్లు, ముక్కు, జుట్టు అన్ని ఫసక్కే!

కొన్ని బ్యూటీప్రొడక్ట్స్‌లో ఉండే పారాబెన్ వల్ల మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలుంటాయి. ఈ పారెబెన్‌ కలిగి ఉన్న ఉత్పత్తులను యూజ్‌ చేసే పురుషులకు స్పెర్మ్‌ కౌంట్‌ కూడా తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటివలి కాలంలో బ్యూటీపార్లర్‌లు నాణ్యత లేని ప్రొడక్ట్స్‌ని కస్టమర్లకు అంటగడుతున్నాయి. రీసెంట్‌గా హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటికి చెందిన ఓ మహిళ బ్యూటీపార్లర్‌కి వెళ్లి ఉన్న జుట్టును ఊడగొట్టుకుంది.

బ్యూటీపార్లర్‌కి వెళ్తున్నారా? ఇది తెలుసుకోకపోతే మీ కళ్లు, ముక్కు, జుట్టు అన్ని ఫసక్కే!
New Update

AHyderabad Beauty Parlour Incident: ఏళ్ల ఓ అమ్మాయి బ్యూటీపార్లర్‌(Beauty Parlour)కి వెళ్లింది.. ఫేషియల్‌ చేయించుకుంది.. అద్దంలో చూసుకుంటే కాసేపు ముఖం కొత్తగా కనిపించినట్టు అనిపించింది.. ఇంతలోనే ఫేస్‌పై దురదలు మొదలయ్యాయి. తర్వాత ముఖమంతా దద్దుర్లు(Rashes) వచ్చాయి. ఇదేంటని బ్యూటీపార్లర్‌ నిర్వాహకులను అడిగితే మీ స్కిన్‌కి ఆ ఫేషియల్‌ పడలేదని సింపూల్‌గా సమాధానం చెప్పారు. ఊహించని ఈ పరిణామానికి కంగుతున్న ఆమె వెంటనే డెర్మటాలజిస్ట్‌ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లింది. అక్కడ డాక్టర్‌ ఇచ్చిన మెడిసన్స్‌ వాడింది. ఫేస్‌ మళ్లి నార్మల్‌ అవ్వడానికి రెండు నెలలు పట్టింది. ఇది దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా మెట్రో సిటీ అయిన హైదరాబాద్‌(Hyderabad), బెంగళూరు లాంటి నగరాల్లో తరచుగా కనిపించే ఘటనలివి.

publive-image

ఉన్న జుట్టు ఊడిపోయింది:

తాజాగా హైదరాబాద్‌లో ఈ తరహా ఘటనే వెలుగుచూడడం తీవ్ర చర్చనీయాంశమైంది. మోడ్రన్‌గా చూడాలని కోరుకున్న భర్తకు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని భావించిన ఓల్డ్‌ సిటీకి చెందిన ఓ మహిళ.. అబిడ్స్‌(abids)లోని క్విన్జ్‌ పార్లల్‌కు వెళ్లింది. బ్యూటీషియన్‌ చెప్పినట్టు జుట్టును షార్ట్‌గా కట్‌ చేయించుకుంది. వెంటనే హెయిర్‌గా అక్కడి బ్యూటిషియన్‌ ఆయిల్‌ అప్లై చేసింది.. వెంటనే కుచ్చులుగా జుట్టు ఊడొచ్చింది. లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్‌కి వచ్చి కంప్లైంట్ చేసింది. పోలీసులు వస్తారని ముందే పసిగట్టిన బ్యూటీపార్లర్‌ నిర్వాహకులు అక్కడ నుంచి చెక్కేశారు. ఈ ఘటనకు సంబంధించిన న్యూస్‌ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

publive-image ప్రతీకాత్మక చిత్రం

బ్యూటీ ప్రొడక్ట్స్‌ వాడొచ్చా?

అందంగా కనిపించాలని అందరికి ఉంటుంది. అయితే కాస్మొటిక్స్‌తో నీట్‌గా కనపడడం వేరు.. నేచురల్‌గా కనపడడం వేరు. నిజానికి అందం కేవలం శరీరానికి సంబంధించే కాదు. తెలుపు, నలుపు అనేవి కేవలం రంగులు మాత్రమే.. తెల్లగా ఉంటేనా అందంగా ఉంటారని అనుకోవడం మూర్ఖత్వం. అది రేసిజం కూడా. స్కిన్‌ తెల్లగా ఉండాలనో.. జుట్టు పెరగాలనో బ్యూటీపార్లర్‌కి వెళ్లి అక్కడ వాళ్లు చెప్పింది చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. లేనిపోని రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. అడ్డదిడ్డంగా బ్యూటీ ప్రొడక్ట్స్‌ వాడడం వల్ల స్కిన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు పలు అధ్యయనాలు ప్రూవ్‌ చేస్తున్నాయి.

publive-image ప్రతీకాత్మక చిత్రం

ఎందుకు మంచి కాదంటే?
సౌందర్య ఉత్పత్తులలో కనిపించే అత్యంత సాధారణ రసాయనం పారాబెన్. ఇది డియోడరెంట్స్, మాయిశ్చరైజర్లు, షాంపూలు, బాడీ వాష్, మేకప్‌లలో ప్రిజర్వేటివ్‌గా వినియోగిస్తున్నారు. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అవకాశాలను పెంచుతుంది. దీని రసాయన నిర్మాణం ఈస్ట్రోజెన్‌ను పోలి ఉంటుంది. పారాబెన్‌లను కలిగి ఉన్న ఉత్పత్తులను ఉపయోగించే పురుషులకు స్పెర్మ్‌ కౌంట్‌ పడిపోతుందట. వారికి తక్కువ టెస్టోస్టెరాన్ కలిగి ఉంటారు. అటు నెయిల్ ప్రొడక్ట్స్, హెయిర్ డై, హెయిర్ స్ట్రెయిట్‌నెర్స్, ఫాల్స్ ఐలాష్ అడెసివ్‌లు, కాస్మెటిక్ గ్లూలు.. కొన్ని షాంపూలలో ఉండే ఫార్మాల్డిహైడ్ రిలీజర్‌లు కూడా క్యాన్సర్‌కు కారణమవుతాయి. రోగనిరోధక వ్యవస్థను కూడా దెబ్బతీస్తాయి. ఇన్ని అనర్ధాలకు కారణమైన నాణ్యత లేని బ్యూటీ ప్రొడక్ట్స్‌పై ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోకవడం అత్యంత ఘోరం..!

Also Read: కడుపు నిండా తిన్నా ఇంకా ఆకలిగా అనిపిస్తోందా? తస్మాత్ జాగ్రత్త

#skin-tips #beauty-parlour #hyderabad-beauty-parlour-incident
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe