Face Glow: సబ్బుకు బదులు ఇవి వాడండి.. ముఖం మెరిసిపోతుంది

కొంతమంది ముఖానికి రకరకాల సబ్బులను కూడా ఉపయోగిస్తారు. సబ్బుకు బదులుగా ముఖం మెరిసేలా చేయడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. బియ్యం పిండి, ముల్తానీ మట్టి, అలోవెరా జెల్ ముఖాన్ని మెరిసేలా చేయడంలో ఎంతగానో సహకరిస్తుంది. వీటి ఉపయోగాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Face Glow: సబ్బుకు బదులు ఇవి వాడండి.. ముఖం మెరిసిపోతుంది

Face Glow: ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. కొత్త కొత్త ప్రొడెక్ట్‌లను వాడుతూ ఉంటారు. కొంతమంది ముఖానికి రకరకాల సబ్బులను కూడా ఉపయోగిస్తారు. సబ్బుకు బదులుగా ముఖం మెరిసేలా చేయడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. సబ్బుకు బదులు ఈ ఐదు వస్తువులను ఉపయోగించి మీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. శెనగపిండి సహజమైన క్లెన్సర్. ఇది చర్మం నుంచి నూనెను తొలగించడంలో సహాయపడుతుంది. దీని కోసం పెరుగు లేదా పాలలో 1 టేబుల్ స్పూన్ శెనగపిండిని కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

publive-image

పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. పెరుగును రోజూ ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే కాకుండా బియ్యపు పిండి ముఖాన్ని మెరిసేలా చేయడంతో పాటు మురికిని తొలగిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పిండిని నీళ్లలో లేదా పాలలో కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ముల్తానీ మట్టి:

ముఖాన్ని మెరిసేలా చేయడంలో ముల్తానీ మట్టి ఎంతగానో సహకరిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టిని రోజ్ వాటర్ లేదా నార్మల్ వాటర్‌లో కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

publive-image

ముఖ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో అలోవెరా జెల్‌ సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు ముఖానికి జెల్ అప్లై చేయవచ్చు. ఉదయం నిద్రలేచిన వెంటనే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. సబ్బుకు బదులుగా ఈ వస్తువులను ఉపయోగించడం ద్వారా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అలర్జీలు ఉన్నవారు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: సమ్మర్‌లో మట్టి కుండ కొంటున్నారా..?.. ఇవి గుర్తుంచుకోండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు