Rice Water: బియ్యం నీటిని ఇలా ఉపయోగించండి.. ముఖంపై మొటిమలు తగ్గించే చిట్కా

చర్మం కోసం బియ్యం నీరు ఉపయోగించడం వల్ల ముఖంపై మొటిమలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. బియ్యం నీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది మొటిమల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బియ్యం నీరు గురించి ఎక్కువ ప్రయోజనాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Rice Water: బియ్యం నీటిని ఇలా ఉపయోగించండి.. ముఖంపై మొటిమలు తగ్గించే చిట్కా

Rice Water: బియ్యం నీటిని చాలామంది పడేస్తారు. బియ్య నీరు ఉపయోగించడం వల్ల ముఖంపై మొటిమలు తగ్గుతాయని ఎవరికి తెలియదు. కొందరు ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి బియ్యం నీటిని వాడుతుంటారు. అయితే దీన్ని ఉపయోగించడం వల్ల ముఖానికి మేలు జరుగుతుంది. చర్మం కోసం బియ్యం నీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి శతాబ్దాలుగా బియ్యం నీటిని ఉపయోగిస్తున్నారని నిపుణులు అంటున్నారు. బియ్యం నీరు చర్మానికి ఎలా ఉపయోగపడుతుందో.. దానివల్ల ఎలాంటి లభాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

చర్మానికి మేలు బియ్యం నీరు:

  • బియ్యం నీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది మొటిమల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • రైస్ వాటర్ చర్మాన్ని ఉపశమనానికి సహాయపడుతుంది. వేడి చికాకు నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
  • ఒక కప్పు నీటిలో ఒక కప్పు బియ్యాన్ని మిక్స్ చేసి. ఈ నీటిని తక్కువ మంట మీద 10 నిమిషాలు మరిగించాలి. తరువాత వడపోసి చల్లారిన తర్వాత ముఖానికి పట్టించాలి.
  • బియ్యం నీటిని ముఖంపై అప్లై చేయడానికి కాటన్ ప్యాడ్‌ని ఉపయోగించవచ్చు. దీన్ని ముఖంతో పాటు మెడకు కూడా పట్టించాలి.
  • కొందరికి రైస్ వాటర్ వాడితే ఎలర్జీ రావచ్చు. ఇది జరిగితే.. డాక్టర్ సలహా ఖచ్చితంగా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఇంట్లోని ప్రతి మూలలో అలర్జీ ఉంటుంది.. దాన్ని ఎలా బయటకు తీయాలంటే?

Advertisment
తాజా కథనాలు