Orange Peel: ఆరెంజ్ తొక్కను ఇలా వాడండి, మీ ముఖం అందంగా మెరిసిపోతుంది! ఆరెంజ్ తొక్కలు ముఖంలోని మురికిని తొలగించి, ముఖాన్ని అందంగా మార్చడంలో సహాయపడతాయి. నారింజ తొక్కను పొడి చేసి, పెరుగు, తేనె, శెనగపిండి వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై 15 నిమిషాల పాటు అప్లై చేసి, తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. By Vijaya Nimma 05 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Orange Peel: ఆరెంజ్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. ముఖానికి దివ్యౌషధంగా పని చేస్తుందని నిపుణులు అంటున్నారు. దీని తొక్కలను ఉపయోగించి చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు చెబుతున్నారు. ఆరెంజ్ తొక్కలు ముఖంలోని మురికిని తొలగించి, ముఖాన్ని అందంగా మార్చడంలో సహాయపడతాయి. ఆరెంజ్ తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీని తొక్కలు ముఖంలోని మురికిని తొలగించి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. నారింజ తొక్కతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. నారింజ తొక్కతో చర్మానికి ఉపయోగాలు: నారింజ తొక్కను పొడి చేసి, పెరుగు, తేనె, శెనగపిండి వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై 15 నిమిషాల పాటు అప్లై చేసి, తర్వాత కడిగేయాలి. ఆరెంజ్ పీల్ పౌడర్‌లో పెరుగు, తేనె కలిపి స్క్రబ్‌ను తయారు చేసుకోవచ్చు. ఆరెంజ్ తొక్క మచ్చలను తొలగిస్తుంది. ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆరెంజ్ తొక్క జిడ్డు చర్మం ఉన్నవారికి ఒక వరంలా పనిచేస్తుంది. అయితే కొందరికి దీనివల్ల ఎలర్జీ ఉండవచ్చని గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్యాచ్ టెస్ట్ చేసిన తరువాత వాడలని నిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్ తొక్కలు చర్మ సౌందర్యానికి అద్భుతం చేస్తాయి. చర్మ సంరక్షణలో సహాయపడే అనేక పోషకాలు నారింజ తొక్కలో పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, నల్ల మచ్చలను తొలగిస్తుంది ఆరెంజ్ తొక్కల పొడితో తయారు చేసిన ఫేస్ మాస్క్ వాసుకోవచ్చు. నారింజ తొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని అకాల వృద్ధాప్యం నుంచి రక్షిస్తుందని నిపుణులు అంటున్నారు నారింజ తొక్కను ఇంట్లో ఎండబెట్టి పౌడర్ చేసుకుంటే మంచిదని చర్మ నిపుణులు చెబుతున్నారు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: వేసవిలో కంటి సంబంధిత సమస్యలు రావచ్చు.. ఈ రెమెడీ పాటించండి! #orange-peel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి