Hair Tips: జుట్టు సమస్యలను తగ్గించుకోవడంలో సహజమైన ఉత్పత్తులు బాగా పనిచేస్తాయి. అందులో భృంగరాజ్ పౌడర్ ఒకటి. సాధారణంగా భృంగరాజ్ తైలం జుట్టుకు రాస్తుంటారు. పౌడర్‌తో కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. పొడవాటి, అందమైన జుట్టును అందరూ ఇష్టపడతారు. మహిళలు కూడా అలాంటి జుట్టు కలిగి ఉండాలని కోరుకుంటారు. ఏ రకమైన హెయిర్‌స్టైల్‌ను చేసుకోవాలన్నా పొడవాటి జుట్టు అవసరం.
సాధారణంగా సహజమైన ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగా మారుతుంది. ముఖ్యంగా ఆయుర్వేద, ఔషధ గుణాలు అధికంగా ఉన్న వస్తువులు జుట్టుకు మంచివిగా భావిస్తారు. వాటిలో భృంగరాజ్ ఒకటి. దీనిని వాడటం వల్ల జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. భృంగరాజ్ పొడిని జుట్టు మీద సరిగ్గా రాసుకుంటే జుట్టు అందంగా, ఒత్తుగా, పొడవుగా తయారవుతుంది.
జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి భృంగరాజ్ పౌడర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని కోసం టీస్పూన్ పొడి, కొబ్బరి నూనెను పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని స్కాల్ప్, హెయిర్ ఫోలికల్స్ అంతటా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత షవర్ క్యాప్ కట్టి పేస్ట్‌ను 2 గంటలు ఉంచి తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ హెయిర్ ప్యాక్‌ని వారానికి మూడుసార్లు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. జుట్టు నెరవడం తగ్గుతుంది. భృంగరాజ్ పౌడర్ నుండి హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇది జుట్టుకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ చేయడానికి 3-4 స్పూన్ల భృంగరాజ్ పౌడర్‌లో 3 స్పూన్ల కలబంద జెల్ కలపండి. దీన్ని బాగా మిక్స్ చేసి తర్వాత పౌడర్‌తో చేసిన హెయిర్ ప్యాక్‌ని తలకు పట్టించాలి.
ఇది కూడా చదవండి: వేసవిలో చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకునే చిన్న చిట్కాలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.