Hyderabad : ఆగస్టు 16న హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్ పై చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే వారి కోసం హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 16 నుంచి 26 వరకు ఇండియాలో ఉన్న ప్రధాన నగరాలన్నింటిలోనూ ఈ ఫెయిర్ ఉంటుందని చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. By Manogna alamuru 13 Aug 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి USA Education Fair : భారత్ (India) నుంచి చదువుకోడానికి రావాలనుకునే విద్యార్ధుల కోసం అమెరికా యూనివర్శిటీలు (America University) ప్రత్యేక ప్రోగ్రామ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఉన్నత చదువుల కోసం అవసరమైన మొత్తం సమాచారాన్ని తెలియజేసేందుకు ఎడ్యుకేషన్‌యూఎస్‌ఏ (Education USA) పేరుతో అమెరికా ప్రభుత్వం ఓ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 16 నుంచి 26వ తేదీ వరకు ఎడ్యుకేషన్ ఫెయిర్‌లను నిర్వహించనున్నారు. ఆగస్టు 16న హైదరాబాద్‌లో, 17న చెన్నైతోపాటు బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణె, ముంబయి, దిల్లీ నగరాల్లో అవగాహన కార్యక్రమాలు జరగనున్నాయి. డిగ్రీ, పీజీ, డాక్టరేట్ ప్రొగ్రామ్‌లలో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థుల కోసం అమెరికాకు చెందిన దాదాపు 80కిపైగా యూనివర్సిటీలు, కాలేజీల ప్రతినిధులు ఈ ఫెయిర్‌లలో ఉండనున్నారు. ఋ ఫెయిర్లను ఎంట్రన్స్ ఉచితం.అయితే రిజిస్ట్రేషన్ మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలని చెన్నై కాన్సులేట్ ఓ ప్రకటనలో తెలిపింది. https://bit.ly/EdUSAFair24Emb వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పింది. Also Read: Sports: పారిస్ నుంచి జర్మనీకు..నెల తరువాత భారత్‌కు నీరజ్ చోప్రా #hyderabad #usa-education-fair #america-university మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి