Israel-Hamas war: ఇక చాలు ఆపండి.. ఇజ్రాయెల్‌-హమాస్‌కు బైడెన్ పిలుపు

ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘర్షణలకు తాత్కాలిక విరామం ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు. బందీలను బయటకు తీసుకొచ్చేందుకు సమయం ఇవ్వాలంటూ పేర్కొన్నారు.

BIG BREAKING: అధ్యక్ష రేసు నుంచి తప్పుకోనున్న జో బైడెన్!
New Update

ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. హమాస్ చేసిన మెరుపు దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజా ప్రాంతంపై దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే ఈ దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా ఆ సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ దాడులను ఆపేయాలంటూ ప్రంపంచ దేశాలు ఇజ్రాయెల్‌కు సూచిస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ ఘర్షణలకు తాత్కాలిక విరామం ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు. మిన్నియాపొలిస్‌లో నిధుల సేకరణ కోసం నిర్వహించిన కార్యక్రమంలో జో బైడెన్‌ పాల్గొన్నారు. అక్కడున్న ఓ వ్యక్తి.. ‘మీరు ఇప్పుడే కాల్పుల విరమణకు పిలుపునివ్వాలంటూ బిగ్గరగా అరిచారు. దీనికి స్పందించిన బైడెన్ విరామం అవసరమని భావిస్తున్నానని.. బందీలను బయటకు తీసుకొచ్చేందుకు సమయం ఇవ్వాలని అన్నారు.

Also Read: ఇజ్రాయెల్ పై యుద్ధం ఆపేదేలేదు..తేల్చి చెప్పిన హమాస్ అధికార ప్రతినిధి..!

తమపై దాడులకు పాల్పడ్డ హమాస్ ఉగ్రవాదుల్ని అంతం చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజాగా గాజాలోని జబాలియా శరణార్థి శిబిరం ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసింది. అయితే ఈ దాడిలో 195 మంది పాలస్తీనా ప్రజలు చనిపోయినట్లు హమాస్ తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్‌ రక్షణ దళాల(IDF) ప్రతినిధి రీర్‌ అడ్మిరల్ డానియల్ హగారి మాట్లాడుతూ కచ్చితమైన నిఘా సమాచారం, సంయుక్తంగా జరుపుతోన్న దాడులతో మా దళాలు హమాస్‌ ఫ్రంట్‌లైన్‌ను ధ్వంసం చేశాయని పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఇజ్రాయెల్‌పై మళ్లీ మళ్లీ దాడులు చేస్తామని హమాస్ అధికార ప్రతినిధి ఘాజి హమాద్ (Ghazi Hamad) అన్నారు. ఆ దేశానికి గుణపాఠం నేర్పిస్తామని, దాన్ని సమూలంగా నాశనం చేసే వరకూ దాడులు ఆపేదేలేదని తేల్చి చెప్పారు. పాలస్తీనా భూభాగాని క స్వాధీనం చేసుకునేవరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

Also read: నగ్నంగా రోడ్లపై తిరుగుతూ యువకుడు హల్ చల్.. పోలీసులపైనే ఎదురు దాడి..!(వీడియో)

#joe-biden #israel-attack #hamas-israel-war
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe