/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/obama.jpg)
Biden Freezes : అమెరికా (America) అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) వేదిక మీద కొన్ని క్షణాల పాటు అలా ఫ్రీజ్ అయిపోయారు. కొద్ది సేపు చలనం లేకుండా నిల్చున్న ఆయనను చూసిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barak Obama) వెంటనే ఆయన చెయ్యి పట్టుకుని నడిపించుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్లారు. శనివారం లాస్ ఏంజెలెస్‌లో జరిగిన ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్‌లో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
పీకాక్ థియేటర్‌లో అర్ధరాత్రి జిమ్మీ కిమ్మెల్‌తో 45 నిమిషాలపాటు సరదాగా సాగిన ఇంటర్వ్యూ తర్వాత ఈ ఘటన కెమెరాలకు చిక్కింది. సభికులకు బైడెన్, ఒబామా అభివాదం చేసిన తర్వాత బైడెన్ దాదాపు 10 సెకన్లపాటు విగ్రహంలా నిల్చుండిపోయారు. ఆయనలో చలనం లేకుపోవడాన్ని గమనించిన ఒబామా చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి హుందాగా నడిపించుకుని తీసుకుని వెళ్లిపోయారు.
ఈ వీడియో చూసిన వారు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. బైడెన్ మరోమారు ఎన్నికలకు (Elections) సిద్ధపడడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అమెరికాలోనే అత్యంత వృద్ధ అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గతవారం ఇటలీలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో బైడెన్ ప్రపంచ దేశాల నేతలకు దూరంగా కనిపించారు.
🔥🚨DEVELOPING: President Obama had to guide Joe Biden off the stage with Jimmy Kimmel at Biden’s fundraising event in The Hamptons with George Clooney. pic.twitter.com/5OoWVhajOl
— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) June 16, 2024