నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలో (America) కనిపించకుండా పోయిన భారతీయ విద్యార్థిని(Indian Student) మయూషి భగత్ (Mayushi Bhagath) ఆచూకీ తెలిపిన వారికి 10 వేల డాలర్ల బహుమతిని అందిస్తామని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (FBI) ప్రకటించింది. భారత్ కి చెందిన 29 ఏళ్ల మయూషి భగత్ 2019 మే 1న న్యూజెర్సీలో (Newjersy) కనిపించకుండ పోయింది.
ఆమెను చివరిసారిగా స్థానికులు ఆమె అపార్ట్ మెంట్ లో ఏప్రిల్ 29, 2019 న పైజామా ప్యాంట్ నల్ల టీషర్టులో చూసినట్లు తెలిపారు. ఆ తరువాత రెండు రోజులకు ఆమె కుటుంబ సభ్యులు ఆమె మే 1 నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంతగా గాలించినప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు.
దీంతో ఆమెను మిస్సింగ్ వ్యక్తుల జాబితాలో గతేడాది పోలీసులు చేర్చారు. మయూషి స్టూడెంట్ వీసా మీద అమెరికాకు వెళ్లింది. ఆమె న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న సమయంలో ఆమె కనిపించకుండా పోయింది. ఆమె మూడు భాషలను అనర్గళంగా మాట్లాడగలదని పోలీసులు తెలిపారు.
ఆమెకు న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ లో స్నేహితులు ఉన్నారని దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ వెల్లడించింది. ఆమె వివరాలను కూడా అధికారులు బయటకు వివరించారు. ఆమె కళ్లు గోధుమ రంగులో ఉంటాయని, ఆమె జుట్టు నల్లగా ఉంటుందని, ఆమె ఎత్తు 5.10 అడుగులు ఉంటుందని వివరించారు.
దీంతో ఎఫ్‌బీఐ తన వెబ్‌సైట్ లోని మోస్ట్ వాంటెడ వ్యక్తుల జాబితాలో మయూషి పేరును కూడా చేర్చాయి. మయూషి ఆచూకీకి సంబంధించిన సమాచారం తెలిపిన వారికి 10 వేల డాలర్లు అంటే సుమారు 8.32 లక్షల కోట్లు రివార్డు ఇస్తామని ఎఫ్‌బీఐ ప్రకటించింది.ఈ మేరకు ఎఫ్‌బీఐ నెవార్క్ ఫీల్డ్ ఆఫీస్, జెర్సీ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు ప్రకటించారు. మయూషి లొకేషన్ లేదా ఆమె ఆచూకీని కనుగొనే సమాచారం తెలిస్తే అందివ్వాలని కోరారు.
Also read: మల్లన్న భక్తులకు అలర్ట్…ఆ మూడు రోజులు ఆర్జిత అభిషేకాలకు బ్రేక్!