FPIs: అమెరికాలో బాండ్ రిటర్న్స్ పెరుగుతున్న నేపథ్యంలో, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) ఈ నెలలో ఇప్పటివరకు భారతీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) నుండి రూ.24,700 కోట్లను ఉపసంహరించుకున్నారు. వారంతా లోన్స్ లేదా బాండ్ మార్కెట్ విషయంలో ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వారు బాండ్ మార్కెట్‌లో (Bond market) రూ.17,120 కోట్ల పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీ డేటా ప్రకారం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐలు) ఈ నెలలో ఇప్పటివరకు (జనవరి 25 వరకు) భారతీయ స్టాక్‌ల నుండి నికర రూ.24,734 కోట్లను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు డిసెంబర్‌లో ఎఫ్‌పిఐ రూ.66,134 కోట్లు, నవంబర్‌లో రూ.9,000 కోట్ల నికర పెట్టుబడులు పెట్టింది.
జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ జాతీయ మీడియాతో చెప్పిన దాని ప్రకారం అమెరికాలో బాండ్లపై రాబడులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ కారణంగానే ఇటీవలి కాలంలో భారత మార్కెట్‌లో ఎఫ్‌పీఐలు(FPIs) విక్రయదారులుగా కొనసాగుతున్నాయని అన్నారు. ఇప్పుడు 10 ఏళ్ల బాండ్లపై రాబడి మళ్లీ 4.18 శాతానికి తగ్గిందని ఆయన చెప్పారు. ఫెడరల్ రిజర్వ్ (Federal Reserve) ద్వారా వడ్డీ రేటు తగ్గింపు 2024 రెండవ అర్ధభాగంలో మాత్రమే జరుగుతుందని ఇది సూచిస్తుంది. మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్-మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ ఈ విషయంపై మాట్లాడుతూ, ఎఫ్‌పిఐలు(FPIs) కొత్త సంవత్సరాన్ని జాగ్రత్తగా పక్కగడ్బందీ విధానంతో ప్రారంభించాయని, అధిక విలువల కారణంగా భారతీయ మార్కెట్లో లాభాలను బుక్ చేసుకున్నాయని చెప్పారు.
Also Read: బడ్జెట్ లో ఉపయోగించే ఈ పదాల అర్ధం తెలుసుకోండి
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
ఇది కాకుండా, వడ్డీ రేటు (Interest Rates) విషయంలో అనిశ్చితి కారణంగా, వారు పక్కకు జరిగారు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడులకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు విదేశీ ఇన్వెస్టర్స్(FPIs) మరిన్ని ఇండెక్స్ ల కోసం చూస్తుంటారని ఆయన అన్నారు. డేటా ప్రకారం, ఎఫ్‌పిఐలు డిసెంబర్‌లో బాండ్ మార్కెట్‌లో రూ.18,302 కోట్లు, నవంబర్‌లో రూ.14,860 కోట్లు, అక్టోబర్‌లో రూ.6,381 కోట్ల నికర పెట్టుబడులు పెట్టాయి. మొత్తంమీద, 2023లో, ఎఫ్‌పిఐలు రూ. 1.71 లక్షల కోట్లను షేర్లలో, రూ. 68,663 కోట్ల రుణం లేదా బాండ్ మార్కెట్‌లోకి ప్రవేశించాయి. ఈ విధంగా క్యాపిటల్ మార్కెట్లో వారు పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.2.4 లక్షల కోట్లు.
Watch this interesting Video :