FPIs: మన స్టాక్ మార్కెట్ నుంచి ఫారిన్ ఇన్వెసర్స్ వెనక్కి.. ఎందుకు?
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) మన స్టాక్ మార్కెట్ నుంచి వెనక్కి తగ్గుతున్నారు. ఇటీవలి కాలంలో ఇప్పటివరకూ 24,700 కోట్ల రూపాయలు ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్లపై రాబడులు పెరుగుతుండడంతో FPIలు మన మార్కెట్లో లాభాలను బుక్ చేస్తున్నారని నిపుణులు అంటున్నారు.