AP: వైఎస్ వివేకా హత్య కేసు.. ప్రధాన సాక్షి అత్యవసర పిటిషన్..! వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి కొమ్మా శివ చంద్రారెడ్డి హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తన సెక్యూరిటీ గన్మెన్లను నోటీసు ఇవ్వకుండా తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. ఈ మధ్యాహ్నం పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు. By Jyoshna Sappogula 27 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YS Viveka Murder Case: మాజీ మంత్రి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి కొమ్మా శివ చంద్రారెడ్డి (Komma Siva Chandra Reddy) హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన తనకు గతంలో కడప జిల్లా జడ్జి మంజూరు చేసిన సెక్యూరిటీ గన్మెన్లను ఉపసంహరించడంపై అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. గతంలో తనకి, తన కుటుంబానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan), వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) నుంచి ప్రాణహాని ఉందని విట్నెస్ ప్రొటెక్షన్ స్కీం 2018 క్రింద గన్ మెన్ లను పొందారు పిటిషనర్ శివ చంద్రారెడ్డి. అయితే, గత నాలుగు రోజుల క్రితం తనకున్న సెక్యూరిటీని ఏ విధమైన నోటీసు ఇవ్వకుండా కడప ఎస్పీ తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ (Jada Sravan Kumar) వాదనలు వినిపించనున్నారు. పిటిషనర్ కు అతని కుటుంబానికి ప్రాణహాని ఉన్నందున తక్షణమే గన్మెన్లు పునరుద్దించవలసిందిగా జడ శ్రవణ్ కుమార్ కోరనున్నారు. శివ చంద్రారెడ్డి అత్యవసర పిటిషన్ పై ఈ రోజు మధ్యాహ్నం హైకోర్టు వాదనలు విననుంది. Also Read: రాజమౌళి – మహేష్ మూవీకి యూనివర్సల్ టైటిల్.. ఏంటంటే? #ap-news #ys-jagan #ys-viveka-murder-case #ys-avinash-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి