USA: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కు చెందిన జ్యోతిష్యురాలు డేనియల్ జాన్సన్. ఆమె ఆన్ లైన్లో ఆధ్యాత్మిక సందేశాలు చెప్పడంలో మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఏప్రిల్ 8వ తేదీన అమెరికాలో సూర్యగ్రహణం ఏర్పడింది. జ్యోతిష్యంలో మంచి అనుభవం ఉన్న డేనియల్ ఈ సూర్యగ్రహాణానికి భయపడింది. ఆన్ లైన్ వేదికగా ఈ సూర్యగ్రహణం చాలా శక్తివంతమైందని..ఇప్పుడే మేల్కోండి గ్రహణం ఏర్పడబోతోంది. కొత్త ప్రపంచం వస్తుంది ఏం చేయాలన్నా ఇది సరైన సమయం అని పోస్టు చేసింది.
ఆ తర్వాత కొన్ని క్షణాలకే తన భర్తను హత్య చేసి తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని కారులో వేగతంగా వెళ్లింది. గంటకు 160 కిలోమీటర్ల అతివేగంతో ప్రయాణించింది. అక్కడితో ఆగలేదు తన 8నెలల చిన్నారిని కారులోనుంచి బయటకు విసిరేసింది. ఈ ఘటనలో చిన్నారి మరణించింది. మరో కూతురు 9ఏండ్ల చిన్నారి ప్రాణాలతో భయపడింది. అనంతరం ఆమె అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కూడా మరణించింది. ఇదంతా క్షణాల్లోనే జరిగింది. ఈ ప్రమాదంలో డేనియల్ శరీరం గుర్తుపట్టలేనంతగా చిధ్రమయ్యింది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు డేనియల్ ను గుర్తించేందుకు చాలా సమయ తసీుకున్నారు. విచారణలో జాన్సన్ , అయోకా ఇద్దరూ ఒకే వ్యక్తి అని తేల్చారు. డేనియల్ జాన్సన్ ను ఆన్ లైన్లో డేనియల్ అయోకాగా పిలుస్తారని ఆమె జ్యోతిష్యురాలని గుర్తించారు. గ్రహణాల కారణంగా ప్రపంచంలో విపత్తు జరుగుతుందని జ్యోతిష్యులు, ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నప్పటికీ ఎలాంటి వాస్తవిక ఆధారాలు మాత్రం లేవు.
అయితే అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో పాక్షిక గ్రహణం ఏర్పడింది. భయంతో డేనియల్ తీసుకున్న ఈ నిర్ణయం మొత్తం కుటుంబాన్నే తుడిచిపెట్టింది. ఎలాంటి భయమైనా, అపోహలు ఉన్నా పెద్దవాళ్లు చర్చించాలి తప్పా ఇలాంటి అనుచిత నిర్ణయాలతో మిమ్మల్ని, కుటుంబాలను ప్రమాదంలోకి నెట్టివేయకూడదు.
ఇది కూడా చదవండి: మీరు ఎప్పుడూ ఏదో టెన్షన్ తో ఉంటారా? అయితే.. ఈ 8 టిప్స్ మీ కోసమే!