UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తు చివర తేదీ పొడిగింపు

UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షల రాయాలనుకునేవారికి అలెర్ట్. ఈ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2024 దరఖాస్తు కోసం చివరి తేదీ మరొక రోజు పొడిగించారు. మార్చి 5తో ఇది ముగియనుండగా ఇప్పుడు మార్చి 6 వరకు దీన్ని పొడిగించారు.

New Update
UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తు చివర తేదీ పొడిగింపు

UPSC Prelims Application Date Extended: యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం అప్లై చేయాలనుకుంటున్నారా..చివరి తేదీ అయిపోయిందని బాధపడుతున్నారా...ఏం పర్వాలేదు. అ గడువును మరోక రోజు పెంచుతూ యుపీఎస్సీ (UPSC) నిర్ణయం తీసుకుంది. మార్చి 6వ తేదీ వరకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చును. దీనికి అప్లై చేసుకోవాలనుకుంటున్న అభ్యర్ధులు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేయడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని యూపీఎస్సీ తెలిపింది.

గత రెండు మూడేళ్ళుగా యూపీఎస్సీకి చెందిన ఓటీఆర్ సిస్టమ్ చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా తరుచుగా హ్యాంగ్ అవుతోంది. ఈ సాంకేతిక సమస్యల కారణంగా యూపీఎస్సీ ఎగ్జామ్స్‌కు నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. అందుకే అభ్యర్ధులు తేదీని పొడిగించాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన రిక్వెస్టులను రోజూ పెడుతున్నారు. UPSC_DATE_EXTENT_KRO, UPSC Prelims2024 అనే హ్యాష్ ట్యాగ్‌లతో ట్వీట్స్ చేస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంది యూపీఎస్సీ. అందుకే చివరి తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇక ఇదే కాకుండా మార్చి 12వ తేదీ లోపు దరఖాస్తు ఫారమ్‌లో సవరణలు కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. యూపీఎస్సీలో మొత్తం 1056 ఖాళీలకు సోటిఫికేషన్ పడింది. ఇందులో IAS,IPS,IRS,IFS సర్వీసులలలో చేరాలనుకునే యువత ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చును. UPSCసివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2024 మే 26న జరగనుంది. పరీక్షా కేంద్రం అభ్యర్ధులను ఎంచుకోవచ్చును. అంటే అభ్యర్ధులు ఎంత త్వరగా దరఖాస్తు చేసుకుంటే అంత త్వరగా వారు కోరుకున్న పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవచ్చును.

ఎంపిక ప్రక్రియ...

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ దరఖాస్తుదారులందరూ ముందు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరు కావాలి. ఇందులో సెలెక్ట్ అయితే మెయిన్స్ పరీక్ష రాయాలి. అందులో కూడా ఉత్తీర్ణులైన వారు ఇంటర్వ్యూకు వెళతారు. ఆ తరువాత మెయిన్స్ ఎగ్జామ్ మార్కులు, ఇంటర్య్యూ ఫలితాల ఆధారంగా తుది మెరిట్ జాబితాను తయారు చేస్తారు. మెయిన్స్ పరీక్ష 1750 మార్కులు, ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. యూపీఎస్సీ సివిల్ ప్రిలిమ్స్ పరీక్ష 80 నగరాల్లో జరగనుంది.

Also Read:National: నది కింద మెట్రో..భారత్ మరో అద్భుతం

Advertisment
తాజా కథనాలు