UPSC Job News : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దరఖాస్తు ఫారమ్‌లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా? ప్రస్తుతం కరెక్షన్ విండో ఓపెన్ అయ్యింది. నమోదు చేసుకున్న అభ్యర్థులందరూ ఏదైనా దిద్దుబాటు చేయాలనుకునే అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ని విజిట్ చేసి కరెక్షన్స్ చేసుకోవచ్చు. మార్చి 13, 2024 వరకు ఈ ఛాన్స్ ఉంది. ఫొటో/సిగ్నేచర్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక దరఖాస్తును సమర్పించిన తర్వాత అభ్యర్థులు తమ అప్లికేషనన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతించబడరు.
ఎలా కరెక్షన్స్ చేసుకోవాలి?
-> UPSC అధికారిక వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి
-> హోమ్‌పేజీలో UPSC CS పరీక్ష కోసం సంబంధిత జాబ్ లింక్‌పై క్లిక్ చేయండి.
-> ఇమెయిల్ ID, మొబైల్ నంబర్, OTR ID, పాస్‌వర్డ్‌తో పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.
-> సూచనలను అనుసరించండి. ఏవైనా అవసరమైన మార్పులు/దిద్దుబాట్లు చేయండి.
-> ఆ తర్వాత UPSC CSE 2024 దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.
Also Read : ఏపీ సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు!