/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/uppala-venkatesh-jpg.webp)
మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్‌ని నియమించారు. ఇక టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని, తెలంగాణా రైతుబందు చైర్మన్‌గా తాటికొండ రాజయ్యని, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా నందికంటి శ్రీధర్‌ని ప్రభుత్వం నియమించింది. వీరి ఎన్నికపై ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
గత నెలలో బీఆర్‌ఎస్‌లో చేరిన ఉప్పల వెంకటేశ్:
తలకొండపల్లి జడ్పీటీసీగా ఉప్పల వెంకటేశ్‌కు మంచి పేరుంది. ఆయన సొంతంగా అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించారు. మంచిమనిషిగా ప్రజల్లో బలమైన ముద్రపడిపోయి ఉన్న నాయకుడు. గత నెలలో ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు. ఉప్పల వెంకటేశ్ గుప్తా, ఆయన అనుచరులు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత నెల రోజులకు మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఆయన్ను నియమించారు. నిజానికి ఉప్పలకు మంచి పదవి దక్కుతుందని గతంలోనే కేటీఆర్ సైతం చెప్పుకొచ్చారు. 18ఏళ్లలకే గ్రామ సర్పంచ్ అయిన రికార్డు వెంకటేశ్‌ది. ఆయనకు పెద్ద పదవి కచ్చితంగా ఇస్తామని తెలంగాణ భవన్ నుంచి హామీ ఇచ్చినట్టు కేటీఆర్ గత నెలలో ప్రకటించారు. వెంకటేశ్‌కు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది. ఈ ట్రస్ట్ ద్వారానే ఆయన అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.
నందికంటి శ్రీధర్‌తో మైనంపల్లికి చెక్:
అటు నందికంటి శ్రీధర్ గత ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అయితే పోత్తుల్లో భాగంగా ఆఖరి నిమిషంలో ఆయనకు టికెట్ దక్కలేదు.ఈ క్రమంలో కుమారుడికి టికెట్ ఇవ్వలేదన్న కారణంగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరారు. అప్పటి నుంచి నందికంటి శ్రీధర్ పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన నందింకంటి శ్రీధర్‌తో మంత్రి కేటీఆర్ స్వయంగా మాట్లాడారు. మంచి పదవి ఇస్తామని కేసీఆర్ నుంచి కూడా నందికంటికి హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. అంతా అనుకున్నట్టే ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా నందికంటి శ్రీధర్‌ని ప్రభుత్వం నియమించింది.
ALSO READ: 23 కోట్లతో 50 పడకల సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాక్.. మంత్రి హరీశ్‌రావు వరాల జల్లు!