Swiggy: స్విగ్గీలో యూపీఐ సేవలు..ఎలా యాక్టివేషన్‌ చేసుకోవాలంటే!

యూపీఐ సేవలకు రోజురోజుకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ- కామర్స్‌ అప్లికేషన్లు, ఫుడ్‌ డెలివరీ యాప్‌ లు కూడా యూపీఐ సేవల్ని ప్రారంభిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి స్విగ్గీ కూడా వచ్చి చేరింది. ఇక నేరుగా స్విగ్గీ పేమెంట్ యాప్ లోనే వినియోగదారులు నగదు చెల్లించవచ్చని సంస్థ పేర్కొంది.

Swiggy-Zomato: కస్టమర్లకు షాకిచ్చిన స్విగ్గీ, జొమాటో..ఆ ఫీజు 20 శాతం పెంపు!
New Update

Swiggy UPI Service: యూపీఐ సేవలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ-కామర్స్‌ అప్లికేషన్లు, ఫుడ డెలివరీ యాప్ లు...తమ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా పేమెంట్స్ చేసే సదుపాయాల్ని తాజాగా వినియోగదారులకు అందుబాటులోనికి తీసుకుని వస్తున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌, జొమాటో యూపీఐ సేవల్ని ప్రారంభించాయి. తాజాగా ఆ లిస్ట్‌ లోకి స్విగ్గీ కూడా వచ్చి చేరింది.

తన అప్లికేషన్‌ వేదికగా యూపీఐ సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా తెలిపింది. యూపీఐ సదుపాయంతో ఇక పై స్విగ్గీ ఫ్లాట్‌ఫామ్‌ లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసే కస్టమర్లు చెల్లింపుల కోసం గూగుల్‌ పే, ఫోన్‌ పే తరహా థర్డ్‌ పార్టీ యాప్స్‌ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. నేరుగా స్విగ్గీ యాప్‌ ద్వారానే పేమెంట్‌ చేయోచ్చు.

లావాదేవీల ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం ఈ సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు స్విగ్గీ హెడ్‌ అనురాగ్‌ రెడ్నెస్‌ తెలిపారు. అయితే దీని కోసం స్విగ్గీ యూపీఐ యాక్టివేట్‌ చేసుకోవాలని తెలిపింది. స్విగ్గీ యాప్‌ లో ప్రొఫైల్‌ పై క్లిక్‌ చేసి పేమెంట్స్ పేజీలోకి వెళ్లగానే బ్యాంక్‌ లింక్డ్‌ యూపీఐ అకౌంట్స్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్స్‌ అంటూ అనేక పేమెంట్‌ ఆప్షన్లు అక్కడ దర్శనమిస్తాయి. అందులోనే స్విగ్గీ యూపీఐ పేమెంట్‌ ఆప్షన్‌ ఎంచుకుని అక్కడే మీ వివరాలు..రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ ఓటీపీ సాయంతో వెరి ఫై చేసి, బ్యాంక్‌ ఖాతాను లింక్‌ చేయాలి.. యూపీఐ పిన్‌ సాయంతో ఇక పేమెంట్స్‌ చేయోచ్చు.

Also Read: పంద్రాగస్టు పండగ.. పదకొండోసారి ఎర్రకోట పై జెండా ఎగరేయనున్న ప్రధాని మోదీ 

#swiggy #upi-services #payments
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe