AP: వైసీపీ నాయకుల్లారా కళ్ళు ఉంటే ఇలా చూడండి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి సెన్షేషనల్ కామెంట్స్..!

రాష్ట్రమంతటా రేపు ఉదయం పండగ వాతావరణంలో పెన్షన్ ల పంపిణి కార్యక్రమం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సందర్భంగా చంద్రబాబు ఫొటోకు పాలాభిషేకం చేశారు. జగన్ రాష్ట్రాన్ని దివాళాతీయిస్తే చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారన్నారు.

New Update
AP: వైసీపీ నాయకుల్లారా కళ్ళు ఉంటే ఇలా చూడండి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి సెన్షేషనల్ కామెంట్స్..!

MLA Kotam Reddy Sridhar Reddy: రాష్ట్రమంతటా రేపు ఉదయం పండగ వాతావరణంలో పెన్షన్ ల పంపిణి కార్యక్రమం జరుగుతుందన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. చెప్పిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ (NTR Bharosa Pension) పెంపు రూ. 3 వేల నుండి 4 వేల వరకు ఇవ్వనున్నామన్నారు. ఒక్క జులై నెల మాత్రమే రూ. 7 వేలు అందిస్తున్నా సందర్భంగా వేలాదిమంది కార్యకర్తల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) చిత్రపటానికి పాలాభిషేఖం చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ.

Also Read: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.. కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు..!

వైసీపీ నాయకులు 7వేల రూపాయల పెన్షన్ ఎలా ఇస్తారు, సాధ్యం కాదు అన్నారుగా ? వైసీపీ నాయకుల్లారా కళ్ళు ఉంటే రేపు ఉదయం చూడండి ఎలా ఇస్తున్నామో అంటూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్ చేశారు. గత ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అన్నిరకాలుగా దివాళా తీసిందని.. రాష్ట్రాన్ని ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో వెనక్కి నెట్టినా ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఒక్కొక్కట్టిగా నెరవేరుస్తున్నారన్నారు. జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని దివాళాతీయిస్తే, నారా చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారని కామెంట్స్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు