Mahalakshmi Scheme: మహిళలకు నెలకు రూ.2,500.. నిబంధనలు ఇవే! తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ మహిళకు నెలకు రూ.2500 ఆర్థిక సాయాన్ని అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 20 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ఏటా రూ.6 వేల కోట్లు ఖర్చవుతోందని అంచనా. By V.J Reddy 12 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Mahalakshmi Scheme: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోలో (Manifesto) చెప్పినట్టుగానే ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి కింద ప్రతీ మహిళకు నెలకు రూ.2,500 ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ పథకానికి సంబంధించిన నిబంధనలు ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ALSO READ: Movierulz, iBOMMA లో సినిమాలు చూస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త! BPL(Below Poverty Line) పేద, నిరుపేద కుటుంబాలకు మాత్రమే స్కీం వర్తించనుంది. కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే స్కీం వర్తించనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు వర్తించదు. పన్ను చెల్లింపుదారులు సైతం అనర్హులుగా తెలిపింది. భర్త ఐటీ కట్టినా ఈ పథకానికి అనర్హులుగా పరిగణిస్తారు. తెలంగాణలో దాదాపు 20 లక్షల మంది నిరుపేద మహిళలు ఉన్నట్లు అధికార వర్గాల లెక్కల చెబుతున్నాయి. ఈ పథకం అమలు చేసేందుకు ఏటా రూ.6 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యయం అవుతుందని అంచనా వేశారు అధికారులు. ఇవే నిబంధనలతో కర్ణాటకలో గృహలక్ష్మి పేరుతో అమలులో ఉన్నాయి. కర్ణాటక ప్రభుత్వం వలే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదేవిధంగా అమలు చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. కర్ణాటకలో ప్రతి మహిళకు రూ.2 వేలు ఇస్తుంది అక్కడి ప్రభుత్వం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ALSO READ: ఆసుపత్రికి రావద్దు.. కేసీఆర్ సంచలన వీడియో #cm-revanth-reddy #mahalakshmi-scheme #telugu-latest-news #breaking-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి