/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/111-jpg.webp)
Video viral: హోలీ పండుగ సందర్భంగా ఓ బ్యాచ్ రెచ్చిపోయింది. పండగపూట రీల్స్ చేసి వైరల్ కావడం కోసం రోడ్డుపై రచ్చ చేసింది. ఓ యువకుడితో కలిసి ఇద్దరు అమ్మాయిలు రొమాంటిక్ సాంగ్ కు రీల్స్ చేసి జనాలకు పిచ్చెక్కించారు. ఒకరికొకరు రంగులద్దుకుంటూ కామా కోరికలతో రగిలిపోతున్నట్లు యాక్షన్ చేశారు. రోడ్డుపై పరిగెడుతున్న బండి వెనకాల కూర్చొని ఈ తంతంగానికి పాల్పడ్డారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కొంతమంది అమ్మాయిలను తిడుతుంటే మరి కొందరు మాత్రం అమేజింగ్ అంటూ పొగిడేస్తున్నారు.
— Anand Prakash (@anand11_du) March 25, 2024
రంగులు పుసుకుంటు రొమాన్స్..
ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ కు చెందిన యువతులు.. ఒక అబ్బాయి స్కూటీ నడుపుతుండగా ఎదెరెదురుగా కూర్చోని రంగులు పుసుకుంటు రొమాన్స్ చేశారు. అయితే ఈ తంతాగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా కొద్ది గంటల్లోనే 23 వేలకు పైగా వ్యూస్ సాధించింది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇదే వీడియోను మరో నెటిజన్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ రీ పోస్టు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆ స్కూటీపై 33 వేల భారీ జరిమానా విధించారు. రోడ్డుపై అడ్డగోలుగా స్టంట్స్ చేస్తే కేసులు పెట్టి జైలులో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Satisfying results
Now @noidatraffic should seize the vehicle pic.twitter.com/2a0Ngst8pq— Madhur Singh (@ThePlacardGuy) March 25, 2024
ఇది కూడా చదవండి: IPL 2024: ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ రిలీజ్.. అక్కడే ఫైనల్ మ్యాచ్!
మూతి పళ్లు రాలిపోయాయి..
ఇదిలావుంటే.. మరో వీడియోలో ఒక అమ్మాయి రన్నింగ్ స్కూటిపై నిలబడి రీల్స్ చేసే క్రమంలో బ్యాలెన్స్ తప్పి కింద పడగా మూతి పళ్లు రాలిపోయాయి. రెండు చేతులు చాచి నిలబడి స్టంట్ చేసే క్రమంలో సడెన్ బ్రేక్ వేయగా దారుణంగా రోడ్డు మీద పల్టీ కొట్టింది. దీంతో తిక్క కుదిరింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఒళ్లు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారంటూ మండిపడుతున్నారు.