Up CM Yogi: మహిళలకు గుడ్ న్యూస్‌ చెప్పిన సీఎం!

యూపీ మహిళలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఓ శుభవార్తను చెప్పారు. ఆగస్టు 19న రక్షాబంధన్‌ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ...ఆగస్టు 18వ తేదీ రాత్రి నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని యోగి తెలిపారు.

Yogi: పేదలు, మహిళల జోలికొస్తే మీ పని ఖతమే.. సీఎం సీరియస్ వార్నింగ్!
New Update

UP CM Yogi: యూపీ మహిళలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఓ శుభవార్తను చెప్పారు. ఆగస్టు 19న రక్షాబంధన్‌ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోదరీమణులకు ఓ బహుమతిని ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం రాష్ట్రంలోని శాంతిభద్రతలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సీనియర్ ప్రభుత్వ స్థాయి అధికారుల సమక్షంలో జోన్, డివిజన్, రేంజ్ మరియు జిల్లా స్థాయిలో ముఖ్యమైన పోస్టులలో నియమించిన అధికారులతో సమావేశమై మాట్లాడారు.

ఈ సమావేశంలో సీఎం యోగి మాట్లాడుతూ.. ఆగస్టు 18వ తేదీ రాత్రి నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని యోగి తెలిపారు. ఈ విషయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో నాగ పంచమి, శ్రావణ సోమవారం, కాకోరి రైలు యాత్ర వార్షికోత్సవం, రక్షాబంధన్, చేహల్లు, జన్మాష్టమి వంటి పండుగలతో పాటు పోలీసు నియామక పరీక్ష వంటి ముఖ్యమైన పనులను కూడా నిర్వహిస్తామని సీఎం పేర్కొన్నారు.

లా అండ్ ఆర్డర్ దృక్కోణంలో ఇది కచ్చితంగా సున్నితమైన సమయం అని.. ప్రతి జిల్లాకు చెందిన పోలీసులు, స్థానిక యంత్రాంగం 24×7 అప్రమత్తంగా ఉండాలని అధికారులను కోరారు. మహిళల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. రాఖీ పౌర్ణమి రోజు కొన్ని ఆరాచక శక్తులు ప్రశాంత వాతావరణాన్ని పాడుచేయడానికి ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయి. అందుకే పోలీసు పెట్రోలింగ్‌ను పెంచండని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Also read: ఆర్‌బీఐ నిర్ణయంతో ఇన్వెస్టర్లకు షాక్.. రూ.2.82 లక్షల కోట్లు నష్టం!

.

#up #cm #womens #good-news #yogi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe