Yogi: పేదలు, మహిళల జోలికొస్తే మీ పని ఖతమే.. సీఎం సీరియస్ వార్నింగ్! మాఫియా గ్యాంగులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పేద ప్రజలు, మహిళల జీవితాల్లో జోక్యం చేసుకునే వారిని వదిలిపెట్టమంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఏ బిడ్డనైనా వేధిస్తే రోడ్డు కూడలిలోనే యమరాజ్ శిక్షిస్తాడని చెప్పారు. By srinivas 14 Mar 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి UP CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాఫియా గ్యాంగులకు (Mafia Gang) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పేద ప్రజలు, మహిళల జీవితాల్లో జోక్యం చేసుకునే వారిని వదిలిపెట్టమంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు అంబేడ్కర్ నగర్‌లో రూ.2,122 కోట్లతో చేపట్టిన పలు ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్డు కూడలిలోనే శిక్ష.. ఈ మేరకు యోగి మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో బీజేపీ (BJP) సర్కారు రాకముందు పేద ప్రజల భూములను మాఫియా ఆక్రమించేదని గుర్తు చేశారు. 'ప్రజలు పండుగలు జరుపుకోకుండా అడ్డుకునే మాఫియా.. ఈరోజు పేదల భూమిని ఆక్రమించాలంటే జంకుతోంది. ఆడ పిల్లలపై వేధింపులు తగ్గిపోయాయి. ఏ బిడ్డనైనా వేధిస్తే రోడ్డు కూడలిలోనే యమరాజ్ వాళ్లను శిక్షిస్తాడు' అన్నారు. అలాగే మాఫియాపై తమ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైందా? కాదా? మీరు దాన్ని సమర్థిస్తారా? లేదా చెప్పాలంటూ ప్రజలను అడిగారు. ఇది కూడా చదవండి: Mumbai: పారిశుద్ధ్య కార్మికులు బానిసలు కాదు.. ఆ కేసులో హైకోర్టు కీలక తీర్పు! డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే.. ఇక యూపిలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉండటం వల్లే మాఫియాను అంతం చేయగలిగామన్నారు. గత ప్రభుత్వాలు పార్టీ నాయకుల ఆదాయం కోసం మాఫియాను పెంచి పోషించాయని అన్నారు. దేశంలో 2014కు ముందు, యూపీలో 2017కు ముందు తమ గురించి, తమ కుటుంబాల గురించే ఆలోచించే ప్రభుత్వాలు ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రధాని మోడీ దేశంలోని 140కోట్ల మంది ప్రజలు తన కుటుంబమని చెబుతున్నారంటూ కొనియాడారు. #up-cm-yogi-adityanath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి