Chandrayaan-3: చంద్రయాన్‌-3 విజయం వెనుక ఉన్న హీరోలు వీళ్లే.. నిజంగా గ్రేట్‌ భయ్యా!

చంద్రయాన్-3 ల్యాండర్‌ జాబిల్లిపై కాలు మోపడం వెనుక ఉన్న రియల్‌ హీరోలపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని ముందుండి నడిపిన వారిలో ఇస్రో చైర్మన్‌ సోమనాథ్, చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్తువేల్, U R రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ శంకరన్, VSSC డైరెక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్, మిషన్ డైరెక్టర్ మోహన్న కుమార్, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చీఫ్ రాజరాజన్ ఉన్నారు.

New Update
Chandrayaan-3: చంద్రయాన్‌-3 విజయం వెనుక ఉన్న హీరోలు వీళ్లే.. నిజంగా గ్రేట్‌ భయ్యా!

People behind Chandrayaan mission success: చంద్రయాన్-3 సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. జాబిల్లి దక్షిణ ధృవంపై కాలు మోపిన ల్యాండర్‌ కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో మరే దేశం కూడా చంద్రుడి దక్షిన ధృవంపై కాలు మోపలేదంటే తాజాగా ఇస్రో సాధించిన గెలుపు ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోవచ్చు. నాలుగేళ్ల క్రితం ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డ చంద్రయాన్‌-2 నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో సైంటిస్టులు తాజాగా చంద్రయాన్‌-3తో గెలుపు రుచి చూడడంతో యావత్ దేశం సంబరాల్లో మునిగిపోయింది. దేశంలోని ప్రతి పౌరుడు ఇస్రో విజయాన్ని సగర్వంగా చెప్పుకుంటున్నాడు. స్వీట్లు పంచుకుంటున్నారు.. ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు. ఈ ఒక్క గెలుపుతో ఇండియాలో హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ ర్యాంక్‌ పెరిగే ఉంటుంది.. దేశం మొత్తాన్ని ఇంత ఆనందపరిచిన చంద్రయాన్‌-3 ప్రయోగం వెనుక హీరోలు ఎవరు?


ఎస్ సోమనాథ్, ఇస్రో చైర్మన్:
చంద్రయాన్ -3 మిషన్ వెనుక వారిలో అందరి కంటే టాప్‌ ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌. గతేడాదే ఇస్రో చైర్మన్‌గా సోమనాథ్‌ బాధ్యతలు స్వీకరించారు. చంద్రయాన్-3తో పాటు, గగన్‌యాన్, ఆదిత్య-ఎల్1తో సహా ఇస్రో ఇతర మిషన్‌ల వెనుక సోమనాథ్‌ పాత్ర వెలకట్టలేనిది.
ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు.. సోమనాథ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) డైరెక్టర్‌గా, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్‌లో పనిచేశారు.

వీరముత్తువేల్, చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్:
చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వీరముత్తువేల్ 2019లో బాధ్యతలు స్వీకరించారు. సాంకేతిక పరిజ్ఞానంలో ఆయన ఎక్స్‌పర్ట్‌. చంద్రయాన్-2 మిషన్‌లో కూడా కీలక పాత్ర పోషించారు. తమిళనాడులోని విల్లుపురంకు చెందిన వీముత్తువేల్.. మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT-M) పూర్వ విద్యార్థి. నాలుగు సంవత్సరాలుగా చంద్రయాన్-3 మిషన్‌ కోసం చాలా కష్టపడ్డారు.

ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్, VSSC డైరెక్టర్:
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (VSSC)లో ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ టీమ్‌ చంద్రయాన్‌-3 విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. VSSCలోని ఆయన బృందం జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) మార్క్-3ని అభివృద్ధి చేసింద. దీనికి ఇప్పుడు లాంచ్ వెహికల్ మార్క్-III అని పేరు పెట్టారు. డాక్టర్ ఉన్నికృష్ణన్ వృత్తిరీత్యా ఏరోస్పేస్ ఇంజనీర్. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IISC) పూర్వ విద్యార్థి.

శంకరన్, U R రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్:

URSC డైరెక్టర్‌గా జూన్‌ 2021లో బాధ్యతలు స్వీకరించారు. దేశీయ ఉప్రగ్రహాలను డెవలప్‌ చేసి ఇస్రోకి ఇవ్వడంలో URSC సాయం చేస్తుంది.
శంకరన్ నాయకత్వంలో URSC టీమ్‌ కమ్యూనికేషన్, వాతావరణ సూచన, రిమోట్ సెన్సింగ్, నావిగేషన్ గ్రహాల అన్వేషణతో సహా ఇస్రో అవసరాలను తీర్చగల ఉపగ్రహాలను అభివృద్ధి చేస్తుంది.

మోహన్న కుమార్, మిషన్ డైరెక్టర్:
మోహన్న కుమార్ LVM3-M4/చంద్రయాన్-3 కోసం మిషన్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త. మోహన్న కుమార్‌ గతంలో LVM3-M3 మిషన్‌లో వన్ వెబ్ ఇండియా-2 ఉపగ్రహాల ప్రయోగానికి డైరెక్టర్‌గా ఉన్నారు.


రాజరాజన్, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చీఫ్:
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ (SDSC SHAR) డైరెక్టర్‌గా రాజరాజన్ ఉన్నారు.SHAR డైరెక్టర్‌గా, ఇస్రో లాంచ్‌లు, హ్యూమన్ స్పేస్ ప్రోగ్రామ్ , SSLV లాంచ్‌ల వెనుక ఉన్నది రాజరాజనే.

ఇలా చంద్రయాన్‌-3 ల్యాండర్‌పై కాలు మోపడం వెనుక అనేక మంది ఉండగా.. ఈ ఆరుగురి పాత్ర మాత్రం వెలకట్టలేనిది.

Advertisment
తాజా కథనాలు