Telangana: హాస్టల్లోకి ఆగంతకుడు.. చావుబతుకుల్లో నర్గింగ్ విద్యార్థిని

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ చదువుతున్న పగిడిపల్లి కారుణ్య (18) అనే విద్యార్థినికి చెవి, ముక్కులో నుంచి రక్తస్రావం జరగగా.. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ ఆగంతకుడు హాస్టల్‌లో చొరబడ్డాడని విద్యార్థినులు చెబుతున్నారు.

New Update
Telangana: హాస్టల్లోకి ఆగంతకుడు.. చావుబతుకుల్లో నర్గింగ్ విద్యార్థిని

Bhadrachalam Nursing College: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మారుతి నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న పగిడిపల్లి కారుణ్య (18) అనే విద్యార్థిని ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ఆమె చెవి, ముక్కులో నుంచి తీవ్రంగా రక్తస్రావం జరుగుతోంది. పలు చోట్ల గాయాలు కూడా అయ్యాయి. అయితే హాస్టల్ బాత్రుంలో కారుణ్య జారిపడిందని వార్డెన్‌ చెబుతున్నాడు. మరోవైపు అర్ధరాత్రి ఓ ఆగంతకుడు హాస్టల్‌లో ప్రవేశించడం చూశామని.. హాస్టల్ విద్యార్థినులు చెబుతున్నారు.


ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి హాస్టల్ యాజమాన్యం కారుణ్యకు చికిత్స అందిస్తోంది. కారుణ్య స్వస్థలం ఖమ్మం జిల్లా మధిర. అయితే తమ కూతురి పరిస్థితిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Also Read: మాచర్లలో అసలేం జరిగింది?.. ఆన్సర్ లేని ఆ ఎనిమిది ప్రశ్నలివే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు