Rajeev Chandrashekar: ముందు RR ట్యాక్స్ గురించి చెప్పు.. సీఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఫైర్ శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను కప్పిపుచ్చేందుకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. తెలంగాణలో RR ట్యాక్స్‌తో వసూలు చేస్తున్న కమిషన్లపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 09 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Union Minister Rajeev Chandrashekar: కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంపై స్పందించారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. శ్యామ్ పిట్రోడా ప్రకటనలు, జాత్యహంకారం, కాంగ్రెస్ పార్టీ విభజన వ్యూహం నుంచి భారతీయ ఓటర్ల దృష్టిని మరల్చేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నాయని అన్నారు. #WATCH | Union Minister Rajeev Chandrashekar says "Revanth Reddy and the Congress party today will try and do everything to deflect the attention of the Indian voter from Sam Pitroda's statements, his racism, the Congress party's strategy of divisiveness. They will do everything… pic.twitter.com/ri5THWF5oV — ANI (@ANI) May 9, 2024 రేవంత్ రెడ్డి దక్షిణ భారతీయుడు, తెలంగాణ రాష్ట్రానికి సీఎం కూడా అని పేర్కొన్నారు.కాగా శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన తెలంగాణకు సీఎం అయితే, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్‌ల వంటి వారు అని శ్యామ్ పిట్రోడా చెప్పిన దానికి ఆయన చెప్పే సమాధానం ఏమిటి? అని నిలదీశారు. ఇదిలా ఉండగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యాపారవేత్తల నుంచి 'RR' పేరుతో ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోడీ సహా ఇతర బీజేపీ నేతలు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై రేవంత్ రెడ్డే సమాధానం చెప్పాలని అన్నారు. #cm-revanth-reddy #union-minister-rajeev-chandrashekar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి