National Police Memorial Day: దేశ వ్యాప్తంగా ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం..

దేశ వ్యాప్తంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. అమరవీరులను స్మరించుకుంటూ.. వారికి నివాళులు అర్పిస్తూ దేశ వ్యాప్తంగా పోలీసులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహిస్తూ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద జరిగిన జాతీయ పోలీస్ స్మారక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. పోలీసుల అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు.

National Police Memorial Day: దేశ వ్యాప్తంగా ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం..
New Update

National Police Memorial Day: వారి పేరు వింటేనే క్రిమినల్స్ వెన్నులో వణుకు పుడుతుంది.. వారి పేరు వింటేనే సామాన్య ప్రజల్లో ధైర్యం వస్తోంది.. వారి కారణంగానే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా నిద్రపోగలగుతున్నారు.. వారే పోలీసులు. రక్షక భటులుగా.. మనల్ని నిరంతరం రక్షిస్తున్నారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. అసాంఘీక శక్తులు ప్రబలకుండా.. అవసరమైన చర్యలు చేపడుతూ శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నారు. ప్రజల ప్రాణాలు రక్షించే క్రమంలో.. క్రిమినల్స్‌ను పట్టుకునే క్రమంలో దేశ వ్యాప్తంగా ఎంతోమంది పోలీసులు అసువులుబాసారు. వారి త్యాగనిరతిని, వారి ధైర్యసాహసాలను గుర్తిస్తూ.. అక్టోబర్ 21న దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల దినోత్సవం (National Police Memorial Day) నిర్వహిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.

దేశ వ్యాప్తంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. అమరవీరులను స్మరించుకుంటూ.. వారికి నివాళులు అర్పిస్తూ దేశ వ్యాప్తంగా పోలీసులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహిస్తూ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద జరిగిన జాతీయ పోలీస్ స్మారక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) పాల్గొన్నారు. పోలీసుల అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. పోలీసుల త్యాగాలు అజరామరం అని కొనియాడారు.

అమిత్ షా ట్వీట్..

Also Read: విశాఖలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. యువకుడు స్పాట్ డెడ్..

ఇక తెలంగాణలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్‌భంగా గోషామహల్ స్టేడియంలో ఫ్లాగ్ డే (Flag Day) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమార్ (DGP Anjani Kumar) సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులకు డీజీపీ, పోలీస్ ఆఫీసర్స్ నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ కంటింజెంట్స్ పరేడ్ నిర్వహించారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 189 పోలీసులు అమరులయ్యారని తెలిపారు డీజీపీ. పోలీస్ సర్వీసెస్‌లో తెలంగాణ రాష్ట్ర ముందుందని చెప్పిన డీజీపీ అంజనీకుమార్.. భరోసా సెంటర్ దేశంలోనే రోల్ మోడల్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజలు కుటుంబాలతో పండుగలు చేసుకుంటే పోలీసులు మాత్రం రోడ్లపై డ్యూటీలు చేస్తున్నారని చెప్పారు. డే అండ్ నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రజల రక్షణే బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా విపత్కర కాలంలోనూ పోలీసులు 24 గంటలు డ్యూటీలు చేశారని, కరోనా కారణంగా ఎంతోమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. పోలీసు అమరవీరులకు జోహార్లు తెలిపారు డీజీపీ అంజనీ కుమార్.

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం..

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఘనంగా పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan) పాల్గొన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్‌ సిబ్బందికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం జగన్.. సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన ‍యోధులు పోలీసులు అని కొనియాడారు. త్యాగనీరతికి నిదర్శనం ఖాకీ డ్రెస్‌ అని పేర్కొన్నారు. పోలీస్‌ కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం జగన్.

Also Read: ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగం.. మిషన్‌ గగన్‌యాన్‌లో తొలి ప్రయోగం

#telangana-police #dgp-anjani-kumar #national-police-memorial-day #home-minister-amit-shah #police-commemoration-day
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe