విశ్వకర్మలకు కేంద్రం(union governament) శుభవార్త చెప్పింది. విశ్వకర్మల కోసం ‘ప్రధాన మంత్రి విశ్వకర్మ(Pm vishwa karma)’పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ ఈ పథకం గురించి ప్రకటించారు. ఆయన ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ముద్ర ఆమోద ముద్ర వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ పథకం ద్వారా 30 లక్షల మంది విశ్వకర్మలకు, వారి కుటుంబాలకు రాయితీపై వడ్డీ రేటుతో పూచీకత్తు రహిత రుణాలను అందిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పథకానికి ఐదేండ్ల కాలానికి గాను రూ. 13 వేల కోట్లను కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. విశ్వకర్మలకు ఈ పథకం కింద సర్టిఫికేట్లు, ఐడీ కార్డులు ఇచ్చి గుర్తిస్తామని తెలిపారు.
విశ్వకర్మలకు 5 శాతం వడ్డీ కింద మొదటి విడతలో రూ. 1 లక్ష చొప్పు క్రెడిట్, రెండో విడతలో రూ. 2 లక్షల వరకు రుణాలను అందించనున్నట్టు చెప్పారు. ఈ పథకంలో భాగంగా విశ్వకర్మలు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు కావాల్సిన శిక్షణను అందజేస్తామన్నారు. శిక్షణా సమయంలో రూ. 500 వరకు స్టైపెండ్ అందించనున్నట్టు వివరించారు.
విశ్వకర్మలకు వారికి కావాల్సిన పనిముట్లను అందజేస్తామని వెల్లడించారు. ఈ పథకం కింద లబ్దిదారులను ఎంపిక చేసి వారికి ఆధునిక వృత్తిపరమైన ఉఫకరణాలను కొనుగోలు చేసేందుకు రూ. 15,000 వరకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ఈ పథకానికి సంబంధించి గ్రామాల్లోని ఉమ్మడి సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆయన ప్రకటించారు.