విశ్వకర్మలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! ఏంటో తెలుసా? విశ్వకర్మల కోసం ‘ప్రధాన మంత్రి విశ్వకర్మ(Pm vishwa karma)’పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం ద్వారా 30 లక్షల మంది విశ్వకర్మలకు, వారి కుటుంబాలకు రాయితీపై వడ్డీ రేటుతో పూచీకత్తు రహిత రుణాలను అందిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పథకానికి ఐదేండ్ల కాలానికి గాను రూ. 13 వేల కోట్లను కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. By G Ramu 16 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి విశ్వకర్మలకు కేంద్రం(union governament) శుభవార్త చెప్పింది. విశ్వకర్మల కోసం ‘ప్రధాన మంత్రి విశ్వకర్మ(Pm vishwa karma)’పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ ఈ పథకం గురించి ప్రకటించారు. ఆయన ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ముద్ర ఆమోద ముద్ర వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పథకం ద్వారా 30 లక్షల మంది విశ్వకర్మలకు, వారి కుటుంబాలకు రాయితీపై వడ్డీ రేటుతో పూచీకత్తు రహిత రుణాలను అందిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పథకానికి ఐదేండ్ల కాలానికి గాను రూ. 13 వేల కోట్లను కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. విశ్వకర్మలకు ఈ పథకం కింద సర్టిఫికేట్లు, ఐడీ కార్డులు ఇచ్చి గుర్తిస్తామని తెలిపారు. విశ్వకర్మలకు 5 శాతం వడ్డీ కింద మొదటి విడతలో రూ. 1 లక్ష చొప్పు క్రెడిట్, రెండో విడతలో రూ. 2 లక్షల వరకు రుణాలను అందించనున్నట్టు చెప్పారు. ఈ పథకంలో భాగంగా విశ్వకర్మలు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు కావాల్సిన శిక్షణను అందజేస్తామన్నారు. శిక్షణా సమయంలో రూ. 500 వరకు స్టైపెండ్ అందించనున్నట్టు వివరించారు. విశ్వకర్మలకు వారికి కావాల్సిన పనిముట్లను అందజేస్తామని వెల్లడించారు. ఈ పథకం కింద లబ్దిదారులను ఎంపిక చేసి వారికి ఆధునిక వృత్తిపరమైన ఉఫకరణాలను కొనుగోలు చేసేందుకు రూ. 15,000 వరకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ఈ పథకానికి సంబంధించి గ్రామాల్లోని ఉమ్మడి సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆయన ప్రకటించారు. #cabinet #new-scheme #vishwakarma #union-governament మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి