PadmaVibhushan for Chiranjeevi: మెగాస్టార్ కు కేంద్రం కానుక? ఆ అవార్డు చిరంజీవికి ఇవ్వనుందా?

మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో  తిరుగులేని హీరో. చిరంజీవికి ఈ రిపబ్లిక్ డే అవార్డుల్లో పద్మవిభూషణ్ అవార్డును కేంద్రం ఇవ్వనున్నదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే పద్మభూషణ్ అందుకున్న చిరంజీవి పద్మ విభూషణుడు కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

Chiranjeevi: మళ్లీ ఒక్కటైన మిత్రులు.. చిరంజీవి బయోగ్రఫీ రాసే బాధ్యత ఆ రచయితకే!
New Update

PadmaVibhushan for Chiranjeevi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆమాటకు వస్తే భారతీయ చిత్ర పరిశ్రమలోనే మెగాస్టార్ చిరంజీవిది స్పెషల్ ప్లేస్. టాలీవుడ్ లో చిరంజీవి ముందు ఒక లెక్క.. చిరంజీవి వచ్చిన తరువాత ఒక లెక్కలా పరిస్థితులు మారిపోయాయి. సినిమా హిట్.. ఫ్లాప్ తో సంబంధం లేకుండా లక్షలాది మంది చిరంజీవి సినిమాని కచ్చితంగా ఒక్కసారి అయినా చూడాలని అనుకుంటారు. మొదటిరోజే చిరంజీవి సినిమా కోసం చొక్కాలు చింపుకునే అభిమానులకు తెలుగురాష్ట్రాల్లో కొదవే లేదు. నటుడిగా.. పరిశ్రమకు పెద్దన్నగా చిరంజీవి టాలీవుడ్ లో మెగా స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 

PadmaVibhushan for Chiranjeevi: రాజకేయాల్లోకి వచ్చినా.. తన తత్వానికి సరిపోవని తేలాకా.. సైలెంట్ గా ఉండి తన పని తాను చేసుకుని పోతున్నారు. రాజకీయాల నుంచి తిరిగి సినిమాలకు వచ్చాకా మరింత ఉత్సాహంగా కొత్త హీరోలతో పోటీ పడుతూ మరీ సినిమాల్లో నటించేస్తూ వస్తున్నారు. ఇక చిరంజీవి సామాజిక సీఐ కార్యక్రమాల గురించి ఒక్కమాటలో చెప్పలేం. బ్లడ్ బ్యాంక్ మొదలుకుని.. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ వరకూ నిత్యం ఎదో ఒక విధంగా ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూనే వస్తున్నారు. కోవిడ్ సమయంలో చిరంజీవి చేసిన సేవలు ఎవ్వరూ మర్చిపోలేనివి. ఆ సమయంలో యాభై కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్లు, విదేశాల నుంచి  తీసుకువచ్చిన అధునాతన పరికరాలు,  చిన్న కుటుంబాలకు, సినీ పరిశ్రమలోని  కార్మికులకు అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. కరోనా సంక్షోభం సమయంలో చాలా ఉదారంగా విరాళాలు ఇచ్చారు. సినీ ఇండస్ట్రీలో మంచైనా.. చెడైనా.. నేనున్నాను అంటూ ముందుండి కార్యక్రమాలను నడిపిస్తూ వస్తున్నారు. 

PadmaVibhushan for Chiranjeevi: చిరంజీవి చేసిన.. చేస్తున్న సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మంచి గుర్తింపు ఇవ్వనున్నదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చిరంజీవికి పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాబోయే రిపబ్లిక్ డే సందర్భంగా ఇచ్చే అవార్డుల్లో భాగంగా చిరంజీవిని పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేశారని అంటున్నారు. ఈ వార్తలు వస్తున్నదగ్గర నుంచీ మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలోనే అఫీషియల్ గా ఈ అవార్డును కేంద్రం ప్రకటించనుంది సమాచారం. 

PadmaVibhushan for Chiranjeevi: చిరంజీవికి అవార్డులు కొత్తకాదు. 2006లో కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.చిరంజీవి సాధించిన విజయాలు, సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఇక సినిమాల్లో నటనకు వచ్చిన అవార్డులు అదనం. ప్రస్తుతం చిరంజీవికి పద్మవిభూషణ్(PadmaVibhushan for Chiranjeevi) అవార్డు వస్తుంది అనే వార్తలు అధికారికంగా నిజం కావాలని.. ఆ అవార్డు చిరంజీవి అందుకోవడం చూసి మురిసిపోవాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. 

Also Read: హౌతీల దాడులు..భారత్ కు భారీ నష్టం..నెలకు ఎంత కోల్పోతుందంటే.. 

Watch this interesting Video:

#chiranjeevi #awards
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe