Agnipath Scheme: విపక్షాల నుంచి తీవ్ర విమర్శలకు గురవుతున్న అగ్నిపథ్ ప్రాజెక్టును ఆపే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోంది. అయితే ఈ నెల చివరి వారంలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో (Central Budget) అగ్నిపథ్ ప్రాజెక్ట్‌లో కొన్ని మార్పులు చేయవచ్చని అంటున్నారు. అగ్నిపథ్ అనేది యువతను సాయుధ దళాలలోకి చేర్చుకునే పథకం. ఈ పథకం ప్రభుత్వానికి రెండు విధాలుగా సహాయం చేస్తుంది. మొదట, సాయుధ దళాలోకి చిన్న వయస్సులోనే ప్రజలను ఆకర్షితులను చేయవచ్చు. రెండవది, రిటైర్డ్ సైనికులకు చెల్లించే పెన్షన్ డబ్బును ఆదా చేస్తుంది.
పూర్తిగా చదవండి..Agnipath: అగ్నిపథ్ ప్రాజెక్ట్ లో కీలక మార్పులు.. బడ్జెట్ లో ప్రతిపాదనలు వస్తాయా?
ఈనెల చివరి వారంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ లో ఉండే కీలక ప్రతిపాదనలపై అంచనాలు వెలువడుతున్నాయి. అగ్నిపథ్ పథకంలో కీలక మార్పులు బడ్జెట్ లో ప్రతిపాదించవచ్చు. విపక్షాల నిరసనల నేపథ్యంలో అగ్నిపథ్ కు మార్పులు చేయొచ్చని అనుకుంటున్నారు.
Translate this News: