Nirmala Sitharaman: రాహుల్ ప్రసంగాన్ని ఖండించిన నిర్మలమ్మ!

బిజెపి హిందువులు హింసాత్మకులు వారు నిజమైన హిందువులు కాదు'' అని లోక్ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఖండించారు. తనను తాను హిందువుగా చెప్పుకునే రాహుల్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని 'ఎక్స్' వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు.

New Update
55th GST council Meeting

Rahul Gandhi: లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్‌ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ మొత్తం హిందూ మతానికి ప్రతినిధి కాదు. బిజెపి హిందువులు హింసాత్మకులు.. వారు నిజమైన హిందువులు కాదు'' అని అన్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi) అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రాహుల్ ప్రసంగం హిందువులందరిపై దాడి. హిందువులను హింసాత్మకంగా చిత్రీకరించేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఖండించారు. అలాగే, అమిత్ షా సహా బీజేపీ ఎంపీలు కూడా ఖండించారు.

ఈ నేపథ్యంలో రాహుల్ హిందువులను హింసాత్మకంగా అభివర్ణించడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. తనను తాను హిందువుగా చెప్పుకునే రాహుల్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని.. ఇది కాంగ్రెస్ ద్వేషం, హిందూ వ్యతిరేక మనస్తత్వాన్ని తెలియజేస్తోందని   'ఎక్స్' వెబ్‌సైట్‌లో పోస్ట్ నిర్మలమ్మ పోస్ట్ చేసింది.

Also Read: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు