LPG Price: బిగ్ అప్‌డేట్.. రూ. 600 లకే గ్యాస్ సిలిండర్ ధర.. వివరాలు మీకోసం..

ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉజ్వల యోజన(Ujjwala Yojana) లబ్ధిదారులకు మరో బహుమతిని ప్రకటించింది కేంద్రం. ఎల్‌పిజి సిలిండర్‌పై(LGP Gas Cylinder) సబ్సిడీని రూ.100 పెంచింది. గతంలో రూ.200 సబ్సిడీని అందించిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో రూ. 100 పెంచి మొత్తం రూ. 300 సబ్సిడీని అందిస్తోంది.

New Update
Gas rates:మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు

Subsidy on LPG Gas Cylinder: ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉజ్వల యోజన(Ujjwala Yojana) లబ్ధిదారులకు మరో బహుమతిని ప్రకటించింది కేంద్రం. ఎల్‌పిజి సిలిండర్‌పై(LGP Gas Cylinder) సబ్సిడీని రూ.100 పెంచింది. గతంలో రూ.200 సబ్సిడీని అందించిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో రూ. 100 పెంచి మొత్తం రూ. 300 సబ్సిడీని అందిస్తోంది. అంటే.. లబ్ధిదారులకు ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్‌ రూ. 600 లకే లభిస్తుంది. ఎల్పీజీ సిలిండర్‌ సబ్సిడీని పెంచుతూ ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. రక్షా బంధన్ సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించింది. దాదాపు రూ. 200 మేర తగ్గించింది. ఉజ్వల పథకం లబ్‌ధిదారులకు సబ్సిడీని రూ. 400 లకు పెంచారు. అయితే, ఈ సబ్సిడీ కేవలం ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే వర్తిస్తుంది.

దేశ రాజధానిలో ధర ఇలా ఉండనుంది..

గత నెల 2023 సెప్టెంబరులో, ఉజ్వల పథకం కింద ఎల్‌పిజి సిలిండర్‌పై ఇచ్చే సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం రూ. 200 పెంచినప్పుడు.. రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1103గా ఉంది. ఇప్పుడు రూ.200కి బదులు రూ.300 తగ్గింపు ఇవ్వడంతో సబ్సిడీ సిలిండర్ ధర రూ.603కి తగ్గింది. ఢిల్లీలో సాధారణ పౌరులకు గ్యాస్ సిలిండర్ ధర రూ.903 కు అందుబాటులో ఉంటుంది.

ఉజ్వల లబ్ధిదారుల సంఖ్య 9.60 కోట్లు..

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 1 మే 2016న ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద, లబ్ధిదారులకు మొదటిసారి ఉచితంగా గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 9.60 కోట్లు. రక్షాబంధన్ సందర్భంగా.. LPG సిలిండర్లపై సబ్సిడీని పెంచుతున్నట్లు ప్రకటించడంతో పాటు, 75 లక్షల మంది లబ్ధిదారులను చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దాంతో కలిపి దేశంలో ఉజ్వల లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు పెరగనుంది.

సామాన్యులకు సిలిండర్ ధర..

ఉజ్వల పథకం యొక్క లబ్ధిదారులకు మాత్రమే LPG సిలిండర్‌పై తగ్గింపు ధర లభిస్తుంది. సాధారణ పౌరులకు LPG సిలిండర్ ధర రూ. 200 మాత్రమే తగ్గింది. దీని ప్రకారం ఢిల్లీలో సాధారణ పౌరులకు 14.2 కిలోల సిలిండర్ ధర రూ.1103 నుంచి రూ.903కి తగ్గింది. దేశంలోని పెద్ద నగరాలైన ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918, కోల్‌కతాలో రూ.929, కాన్పూర్‌లో రూ.918, ప్రయాగ్‌రాజ్‌లో రూ.956, భోపాల్‌లో రూ.908.50, జైపూర్‌లో రూ.906.50, పాట్నాలో రూ.1001, రాయ్‌పూర్‌లో రూ.1001 చొప్పున ధర ఉంది.

Also Read:

Central Cabinet Decisions: తెలంగాణపై కేంద్రం వరాల జల్లు.. ఎట్టకేలకు కృష్ణా జలాలపై స్పందన..

Chandrababu case: చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపు?? కొద్ది గంటల్లో ఏం జరగబోతోంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు