వేగంగా పెరుగుతున్న భారతీయుల సంపద..... గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ లో సంచలన విషయాలు....!

యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (UBS)'గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2023' పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. భారత ప్రజల సంపద అత్యంత వేగంగా పెరుగుతోందని పేర్కొంది. దేశంలో పెద్దలకు సగటు ఆస్తులు సుమారు రూ. 14 లక్షలు ఉన్నట్టు తెలిపింది. దేశ ప్రజల సంపద ఇలానే పెరుగుతూ పోతే త్వరలోనే భారతీయులు ధనవంతులు అవుతారని పేర్కొంది.

author-image
By G Ramu
New Update

నివేదిక ప్రకారం.... 2000 సంవత్సరం నుండి దేశ ప్రజల సంపదలొ పెరుగుదల ఊపందుకుంది. కానీ ప్రపంచ సరాసరి సంపదతో పోలిస్తే భారత్ కాస్త వెనుకబడి ఉంది. ప్రస్తుతం ప్రపంచ ఆస్తుల సరాసరి సంపద రూ. 70 లక్షలు. ఇది ప్రపంచ సరాసరితో పోలిస్తే భారతీయుల సంపద ఐదు రెట్లు తక్కువ.

గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2023ను ఈ ఏడాది జూన్-1న యూబీఎస్ పబ్లిష్ చేసింది. 2000 నుంచి 23 మధ్య చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ప్రజల సంపద క్షీణించింది. 2022లొ మొత్త ప్రైవేట్ వ్యక్తుల ఆస్తుల మొత్తం విలువ 454.4 ట్రిలియన్ల(38 వేల లక్షల కోట్లకు చేరుకుంది. అది 2021లో ప్రైవేట్ వ్యక్తుల ఆదాయంతో పోలిస్తే రూ. 940 లక్షల కోట్లు తక్కువ.

భారత్ లో సంపదతో పాటు అసమానత రేటు కూడా చాలా వేగంగా పెరుగుతోంది. గణాంకాలను బట్టి చూస్తే 2000 సంవత్సరంలో దేశ సంపదలో మొత్తం 33.2 శాతం సంపద కేవలం దేశంలోని 1 శాతం వ్యక్తుల చేతుల్లో వుంది. కానీ 22 ఏళ్ల తర్వాత అంటే 2022 నాటికి 40.4 శాతం సంపద ఆ 1 శాతం జనాభా చేతుల్లోనే ఉండి పోయింది. 2022లో దేశంలో మొత్తం 8.49 లక్షల మంది బిలియనీర్లు ఉన్నారు.

వారిలో 5,480 మంది బిలియనీర్లు 100 మిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. ఇక పక్క దేశం చైనాలో 2021తో పోలిస్తే రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన పెరుగుదల చోటు చేసుకుంది. 2021లో భారతదేశ జిడిపి 9.1 శాతం రేటుతో వృద్ధి చెందగా, పొరుగు దేశం చైనా జీడీపీ కూడా 8.4 శాతం రేటుతో వృద్ధి చెందింది. ఒక సంవత్సరం తర్వాత రెండు దేశాల జీడీపీలో పెద్ద వ్యత్యాసం కనిపించింది.

ఈ నివేదిక ప్రకారం, భారత పొరుగు దేశాలైన పాకిస్తాన్, నేపాల్, మయన్మార్ వంటి దేశాల పరిస్థితి చాలా దయనీయంగా వుంది. పాకిస్తాన్, నేపాల్‌లోని ప్రతి వయోజనుడి సంపద దాదాపు రూ.4 లక్షలకు చేరింది. మయన్మార్‌లో ఈ సంఖ్య 6 లక్షలు కాగా బంగ్లాదేశ్‌లో 8 లక్షలుగా నివేదిక పేర్కొంది. ఇక నివేదిక ప్రకారం... రాబోయే 5 సంవత్సరాల్లో భారత్ లో బిలియనీర్ల సంఖ్య రెట్టింపు అవుతుంది. 2022లో భారతదేశంలో 161 మంది బిలియనీర్లు ఉండగా, వారి సంఖ్య 195కి పెరిగే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు