/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-24T145824.916-jpg.webp)
Union Bank FD Interest Rate: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ బ్యాంక్ లో చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు 399 రోజుల స్పెషల్ స్కీమ్ తో గరిష్ఠంగా 8 శాతం వరకు వడ్డీ ఆఫర్ ఇవ్వబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై..
ఈ మేరకు రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (Fixed Deposits) వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది. కొత్తగా సవరించిన వడ్డీ రేట్లు జనవరి 19 నుంచే అమలులోకి తీసుకొచ్చామని, ప్రస్తుతం యూనియన్ బ్యాంకులో 7 రోజుల నుంచి 10 ఏళ్ల మెచ్యూరిటీ టెన్యూర్ గల డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 3.5 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ ఆఫర్ ఇచ్చింది. సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.75 శాతం వడ్డీ రేట్లు కల్పిస్తు్న్నట్లు ప్రకటించింది.
జనరల్ కస్టమర్లకు..
అలాగే 7 రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 3.5 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. 46- 90 రోజుల డిపాజిట్లపై 4.50 శాతం, 91- 120 రోజుల డిపాజిట్లపై 4.80 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 121- 180 రోజుల డిపాజిట్లపై 4.90 శాతం, 181 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ అందిస్తోంది. ఒక ఏడాది నుంచి 398 రోజుల డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ కల్పిస్తుండగా.. 399 రోజుల స్పెషల్ స్కీమ్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 7.25 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేసింది. 400 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ ఇస్తోంది. 399 రోజుల మెచ్యూరిటీ టెన్యూర్ గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు గరిష్ఠంగా 7.25 శాతం మేర వడ్డీ రేటు ఆఫర్ చేస్తుండగా.. 60 ఏళ్ల నుంచి 80 ఏళ్లలోపు సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ అందిస్తుంది.
ఇది కూడా చదవండి :Karimnagar: కరీంనగర్ లో భూకబ్జాలపై పోలీసుల ఉక్కుపాదం.. కార్పోరేటర్, బీఆర్ఎస్ నాయకుడు అరెస్ట్
సీనియర్ సిటిజన్లకు..
అలాగే 80 ఏళ్ల వయసు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 8 శాతం మేర వడ్డీ ఆఫర్ (Interest Rate) చేసింది. 399 రోజుల స్పెషల్ ఎఫ్‌డీ జనరల్ కస్టమర్ రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.7.25 శాతం వడ్డీ రేటుతో మెచ్యూరిటీ నాటికి వడ్డీ రూపంలో రూ.40,431 వరకు లభిస్తాయి. ఇదే టెన్యూర్ పై సీనియర్ సిటిజన్ రూ.5 లక్షలు జమ చేస్తే వడ్డీ రేటు 7.75 శాతంతో మెచ్యూరీటి తర్వాత రూ.43,846 వడ్డీ లభిస్తుంది. అలాగే సూపర్ సీనియర్ సిటిజన్ పేరుపై జమ చేస్తే వడ్డీ రేటు 8 శాతం వర్తిస్తుంది. 399 రోజుల తర్వాత వారికి రూ.5 లక్షలకు వడ్డీ రూ.44,416 వరకు లభించనుంది. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
 Follow Us
 Follow Us