/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/reel.jpg)
Viral Video: ఈ మధ్య కాలంలో యువతకు రీల్స్ (Reels) పిచ్చి బాగా ముదిరింది. కొందరు రీల్స్ మాయలో పడి ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. మరికొందరు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇంకొందరు తమ వాహనాలపై విచ్చలవీడిగా చిందులేస్తున్నారు. తాజాగా, ఇద్దరు యువకులు థార్ వాహనాలను రీల్స్ చేయడానికి సముద్రంలోకి తీసుకెళ్లరు. అయితే, రీల్స్ చేస్తుండగా వారికి ఊహించని ఘటన జరిగింది.
Also Read: ఐదు సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోదం.. వైసీపీ అవినీతి అక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు..!
రెండు కార్లు సముద్రంలో ఇరుక్కుపోయాయి. ఈ సంఘటన గుజరాత్ - కచ్ ప్రాంతంలో (Gujarat) ముంద్రా తీరం వద్ద చోటుచేసుకుంది. ఖరీదైన కార్లతో రీల్ చేస్తుండగా ఉన్నట్టుండి అలలు కమ్మేశాయి. దీంతో యువకులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజిన్లు.. తిక్క కుదిరిందిగా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.