PM Vishwakarma Yojana: మీకు 18 ఏళ్లు నిండితే...సర్కార్ 3 లక్షలు ఇస్తోంది..పూర్తి వివరాలివే..!!

18ఏళ్లు లేదంటే అంతకంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తులు అసంఘటిత రంగంలో చేతివృత్తుల పనిలో నిమగ్నమైన వారికి ప్రభుత్వం 3 లక్షల రూపాయల రుణాన్ని అందిస్తోంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాన్ని మంజూరు చేస్తారు.పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

New Update
PM Vishwakarma Yojana: మీకు 18 ఏళ్లు నిండితే...సర్కార్ 3 లక్షలు ఇస్తోంది..పూర్తి వివరాలివే..!!

PM Vishwakarma Yojana:  అన్ని రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రంలోని మోదీ సర్కార్. పరిశ్రమలతోపాటు చేతి వ్రుత్తులకు అండగా నిలుస్తోంది. సాంప్రదాయ కళాకారులు, చేతి వ్రుత్తుల వారిని ప్రోత్సహించేందుకు మోదీ సర్కార్ 2023 సెప్టెంబర్ 17న పీఎం విశ్వకర్మ యోజన స్కీంను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ స్కీం కింద దేశంలోని హస్తకళాకారులకు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. వారు తయారుచేసే వస్తువులకు మార్కెటింగ్ కల్పించడం, నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం రూ. 13వేలకోట్ల నిధులను ఖర్చు చేయనుంది సర్కార్. ఈ స్కీం అర్హతలు, ప్రయోజనాలు దరఖాస్తు ప్రక్రియ వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీం సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ పర్యవేక్షిస్తుంది. రుణ సదుపాయం, నైపుణ్య శిక్షణ, అడ్వాన్స్డ్ టూల్స్ , డిజిటల్ ట్రాన్సాక్షన్లను ఇన్సెంటివ్ లు వంటి సదుపాయాలతో అన్ని రంగాలను ప్రోత్సహిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ చెయిన్ సిస్టమ్ లో భాగస్వామ్యం చేయడానికి టెక్నాలజీతో కళాకారులను సన్నద్ధం చేస్తుంది.

అర్హతలు:
18ఏళ్ల వయస్సు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్నవారు అసంఘటిత రంగంలో చేతివ్రుత్తుల పనిలోనిమగ్నమైన ఉండాలి. స్వయం ఉపాధి పొందుతున్నవాళ్లు కూడా ఈ విశ్వకర్మ స్కీం సహాయం పొందేందుకు అర్హులుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ పథకంలో 18ట్రేడ్ లకు చోటు కల్పించారు.

ప్రయోజనాలు:
హస్తకళాకారులు, చేతివృత్తులవారి నైపుణ్యాన్ని గుర్తించి ప్రధానమంత్రి విశ్వకర్మ సర్టిఫికేట్, ఐడీ కార్డ్‌ను జారీ చేస్తారు. విశ్వకర్మలకు రోజుకు రూ.500 స్టైఫండ్‌తో 5 రోజుల నుంచి వారం వరకు ప్రాథమిక స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుంది. అడ్వాన్స్‌డ్ టూల్స్, డిజిటల్, ఫైనాన్స్ స్కిల్స్, ఎంటర్ ప్రెన్యూయర్‌షిప్, క్రెడిట్ సపోర్ట్, బ్రాండింగ్, మార్కెటింగ్ టెక్నిక్స్ వంటి అంశాలపై ఈ ట్రైనింగ్ లో అభ్యర్థులకు అవగాహన కల్పిస్తారు.

అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్:
బేసిక్ ట్రైనింగ్ పూర్తయ్యాక రోజుకు రూ.500 స్టైఫండ్‌తో 15 రోజుల పాటు అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇస్తారు. లెటెస్ట్ టెక్నాలజీ, డిజైన్, పరిశ్రమ భాగస్వాములతో అనుసంధానం పెంపొందించడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. స్వీయ-ఉపాధి నుంచి సంస్థల స్థాపన ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహిస్తారు.

రుణ సదుపాయం:
ప్రాథమిక నైపుణ్య శిక్షణను పూర్తి చేసిన వారికి 18 నెలల రీపేమెంట్ వ్యవధితో రూ.1 లక్ష వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాన్ని ఇస్తారు. ప్రామాణిక రుణ ఖాతాను నిర్వహించడం, డిజిటల్ లావాదేవీల కోసం అడ్వాన్స్‌డ్ నైపుణ్యట్రైనింగ్ తీసుకున్నవారికి 2వ విడతలో రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తారు. అయితే రూ. 2 లక్షల రుణాన్ని పొందాలంటే ముందుగా ప్రారంభ రూ.1 లక్ష రుణాన్ని తిరిగి చెల్లించాలి.

రిజిస్ట్రేషన్ ప్రాసెస్:
మీరు పీఎం విశ్వకర్మ పోర్టల్ https://pmvishwakarma.gov.in ను ఓపెన్ చేసి ..హోమ్ పేజీలోకి వెళ్లి, ‘హౌ టూ రిజిస్ట్రేషన్’ అనే ఆప్షన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. మీ మొబైల్ నంబర్ అథెంటికేషన్, ఆధార్ ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి..ఆర్టిషియన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేసి అన్ని వివరాలు ఎంటర్ చేయాలి. ఇప్పుడు పీఎం విశ్వకర్మ డిజిటల్ ఐడీ, సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. స్కీమ్ కాంపోనెంట్స్ కోసం అప్లయ్ చేసుకోవాలి.

వెరిఫికేషన్ ప్రాసెస్:
వెరిఫికేషన్ ప్రాసెస్ మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో గ్రామ పంచాయతీ/యుఎల్‌బి స్థాయిలో ధృవీకరణ తర్వాత జిల్లా అమలు కమిటీ పరిశీలన చేసి సిఫార్సు చేస్తుంది. చివరగా స్క్రీనింగ్ కమిటీ ఆమోదించిన తర్వాత పీఎం విశ్వకర్మ యోజనం పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే కళాకారులు 18002677777కు కాల్ చేయవచ్చు. లేదా [email protected]కు ఇమెయిల్ కూడా చేయవచ్చు.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అదిరిపోయే వార్త…రైల్వేలో 9వేల టెక్నీషియన్ పోస్టులు..పూర్తి వివరాలివే..!!

Advertisment
తాజా కథనాలు