Tech News: చైనాకు చెక్‌..ఇక మేకిన్ ఇండియా ల్యాప్‌టాప్‌లతో డ్రాగన్‌కు దబిడి దిబిడే!

చైనా నుంచి టెక్‌ ఉత్పత్తుల ఇంపోర్ట్‌ను తగ్గించుకునేందుకు భారత్‌ వేగంగా అడుగులేస్తోంది. పీసీలు, సర్వర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల తయారీలను చేపడుతోంది. పీఎల్‌ఐ పథకం కింద 27 కంపెనీలకు తాజాగా అనుమతులిచ్చింది. ఈ లిస్ట్‌లో డెల్, HP, లెనోవా, ఏసర్ లాంటి కంపెనీలున్నాయి.

New Update
Tech News: చైనాకు చెక్‌..ఇక మేకిన్ ఇండియా ల్యాప్‌టాప్‌లతో డ్రాగన్‌కు దబిడి దిబిడే!

Make in India: ఇండియా సెల్ఫ్‌గా ఎదుగుతోంది. ఇతర దేశాలపై ఆధారపడడం క్రమంగా తగ్గిస్తోంది. తనకంటూ ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకుంటున్న ఇండియా ఒక్కొ అడుగు ముందుకేస్తోంది. టెక్నాలజీ పరంగా ఒక్కొ మెట్టుపైకి ఎక్కుతోంది. ఇది చాలా మంచి విషయమే. ఎందుకంటే టెక్ ప్రొడక్ట్స్‌ పరంగా ఇండియా అయినా అమెరికా అయినా ఎక్కువగా ఆధారపడేది చైనాపైనే. మరోవైపు సరిహద్దుల్లో డ్రాగన్‌ తన తోక వంకర బుద్ధిని బయటపెట్టుకుంటూనే ఉంది. దీంతో చైనాతో స్లోగా వాణిజ్య సంబంధాలను పరిమితం చేపే విధంగా కేంద్రం ప్లాన్లు వేస్తోంది. ఈక్రమంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఐటీ హార్డ్‌వేర్ కోసం అప్‌గ్రేడ్ చేసిన రూ.17,000 కోట్ల ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకం కింద 27 కంపెనీలకు అనుమతి లభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 95 శాతం... అంటే 23 కంపెనీలు డే-జీరో నుంచి తయారీని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పీసీలు(PC), సర్వర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల తయారీలో పెద్ద శక్తిగా ఉండటానికి తమకు ఇది సహాయపడుతుందని చెప్పారు. ఈ కంపెనీలు రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. పూర్తి లిస్ట్‌ను చెక్ చేసుకోండి.

1) డెల్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
2) HP
3) లెనోవా
4) ఏసర్
5) ఆసుస్
6) థామ్సన్
7) ఫాక్స్‌కాన్
8) ICT సర్వీస్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌
9) రైజింగ్ స్టార్స్ హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌
10) ఫ్లెక్స్‌ట్రోనిక్స్‌ టెక్నాలజీస్‌ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌
11) లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్
12) డిక్సన్ టెక్నాలజీస్ (ఇండియా) లిమిటెడ్.
13) ఇన్ఫోపవర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌
14) భగవతి ప్రోడక్ట్స్ లిమిటెడ్
15) నియోలింక్ టెలి కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
16) అప్టైమస్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌
17) న్యూవెబ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌
18) స్మైల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.
19) VVDN టెక్నాలజీస్ ప్రైవేట్. లిమిటెడ్
20) పనాచే డిజిలైఫ్ లిమిటెడ్
21) సిర్మా
22) సహస్ర
23) కీన్స్ టెక్

Also Read: పొట్టి ఫైట్‌కు విశాఖ రెడీ.. తెలుగు కుర్రాడు తిలక్‌వైపే అందరి చూపు!

WATCH:

Advertisment
తాజా కథనాలు