Undavalli Arun Kumar RTV Uncensored Interview: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై(Chandrababu) నమోదైన కేసులపై విచారణను సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్(Arun Kumar) వేసిన పిటిషన్ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీవీ అన్ సెన్సార్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై నమోదైన కేసులపై, ఏపీలో ప్రస్తుత రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదన్నారు. అదే సమయంలో తాను ఎన్నికల రాజకీయాలకు మాత్రమే దూరమయ్యానని, రాజకీయాలకు మాత్రం దూరం కాలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక తాను చంద్రబాబుపై నమోదైన కేసుల అంశంలో హైకోర్టును ఆశ్రయించడంపైనా క్లారిటీ ఇచ్చారు. కేసును చూడగానే.. టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, ప్రభుత్వం నమోదు చేసిన కేసులను పరిశీలించిన తరువాత.. సీఐడీ కంటే.. సీబీఐతో విచారణ జరిగితే బాగుంటుందని అనిపించిందన్నారు. అందుకే సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే, ఈ పిటిషన్ వేయడం వెనుక ఎవరి ప్రోత్బలం లేదన్నారు.
సీబీఐ ఎంక్వైరీ చాలా ఫెయిర్‌గా ఉంటుంది..
దేశంలోనే సీబీఐ ఎంక్వైరీ చాలా ఫెయిర్‌గా ఉంటుందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించానని అన్నారు. అయితే, అప్పటికే ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లడంతో ఎవరూ ఏమీ చేయలేకపోయారన్నారు. చంద్రబాబు కేసును కూడా సీబీఐ విచారణకు ఇస్తే.. టీడీపీ, వైసీపీ ఆరోపించుకుంటున్నట్లుగా క్షక్ష సాధింపులు ఏమైనా ఉంటే తేలిపోతాయి కదా అని అన్నారు.
నా ఆనందం కోసమే పిటిషన్ వేశాను..
వైసీపీకి ఫేవర్ చేయడం కోసమే హైకోర్టులో పిటిషన్ వేశారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై స్పందించారు ఉండవల్లి అరుణ్ కుమార్. వైసీపీ ఆనందం కోసమో.. మరెవరి ఆనందం కోసమే ఈ పిటిషన్ దాఖలు చేయలేదని అన్నారు. ఈ కేసులో ఉన్న సీరియస్‌నెస్ ని గుర్తించే హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు. ఇదే సమయంలో రామోజీరావుపై కేసు వేయడంపైనా స్పందించారు ఉండవల్లి. ఇవొక్కటే కాదు.. ఎవరూ సాహసించని, ధైర్యం చేయని కేసుల్లోనే తాను ఇన్వాల్వ్ అవుతానని, అదే తన కళ్లలో ఆనందాన్ని కలిగిస్తుందని వ్యాఖ్యానించారు.
ఇలా చేస్తే ఎప్పుడో బెయిల్ వచ్చేది..
"ప్రభుత్వం వరుసగా కేసులు పెడుతోంది. ప్రభుత్వానికి ఏదో స్ట్రాటజీ ఉంటుంది. ఈయన ఇంతకాలం జైల్లో ఉంటేనే బాగుంటుందని ఏదో ఆలోచించే ఉంటారు. ఎప్పుడు బయటకొస్తారనేది మాత్రం చెప్పలేం. సాధారణంగా అయితే, ఆయన మొదట్లోనే వచ్చేయాలి. రిమాండ్ అనగానే.. ఢిల్లీ ప్లీడర్లు రావాల్సిన అవసరం లేదు. లోకల్ గా ఉన్న చిన్న ప్లీడర్స్ వెళ్లి.. 70 ఏళ్లు దాటిపోయాయిన మనిషి, ఆయనకు ఆరోగ్య బాగోలేదు, ఇంటి వద్దే ఉంటారు ఎక్కడికీ వెళ్లడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు, పాస్‌పోర్ట్ మీ దగ్గర పెట్టుకోండి అంటే ఎప్పుడో బెయిల్ వచ్చేది. పీవీ నరసింహారావు కేసులో గతంలో ఇలానే వాదిస్తే.. వెంటనే బెయిల్ లభించింది." అని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు.
ఇదొక్కటే కాదు.. చాలా ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న అనేక అంశాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంకా ఏమేం మాట్లాడారో తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియోలో ఫుల్ ఇంటర్వ్యూ చూడొచ్చు.
Also Read:
Batukamma:గౌరమ్మను తల్లి గంగమ్మ ఒడిలో వదిలేసే సద్దుల బతుకమ్మ
Women Health: మహిళలూ బీ అలర్ట్.. ఈ 7 లక్షణాలు అస్సలు విస్మరించొద్దు..