అగ్రరాజ్యం అమెరికాలో (America) దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు ఏపీ (Andhrapradesh) వ్యక్తులు గత 8 నెలలుగా 20 ఏళ్ల భారత విద్యార్థిని బంధించి, తీవ్రంగా కొడుతూ రాక్షసులులాగా ప్రవర్తించారు. ఈ ఘటన గత 8 నెలలుగా కొనసాగుతుంది. ఈ దారుణంలో అమెరికాలోని మిస్సోరి (MIssorie) రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ లో జరిగింది.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత సంతతికి చెందిన 20 ఏళ్ల యువకుడిని బంధించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్తారు వెంకటేశ్ రెడ్డి, నిఖిల్, శ్రవణ్ లు తీవ్రంగా చిత్ర హింసాలు పెట్టారు. అయితే బాధిత యువకుడు ఓ రెస్టారెంట్ లో ఓ వ్యక్తికి చాలా బాధగా , నీరసంగా కనిపించాడు. దీంతో ఆ వ్యక్తి బాధిత యువకుడి వద్దకు వెళ్లి ఏదైనా సమస్య ఉంటే తెలపమని అడిగాడంతో పాటు అతనికి తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు.
అయితే యువకుడు అతనికి అక్కడ ఏమి చెప్పకుండ..ఇంటికి వెళ్లిన తరువాత వాట్సాప్ ద్వారా ముగ్గురు వ్యక్తులు తనని చిత్రహింసలకు గురి చేస్తున్నారని..ఈ దారుణం గత 8 నెలలుగా జరుగుతుందని వివరించాడు. దీంతో ఆ యువకుడు పోలీసులను తీసుకుని ఆ బాధిత యువకుని ఇంటి వద్దకు చేరుకున్నాడు.
అయితే పోలీసులు లోపలికి వచ్చేందుకు ఆ ముగ్గురు యువకులు కూడా అంగీకరించలేదు. అయితే ఇంటికి పోలీసులు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న బాధిత యువకుడు వెంటనే పోలీసుల వద్దకు వచ్చి తన బాధను అంతా చెప్పుకున్నాడు. అంతేకాకుండా ఈ నరకం నుంచి తనని విడిపించాలని కోరుకున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. మానవ అక్రమ రవాణా, హింసించడం తదితర సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. బాధిత యువకుడు నిందిత యువకులు ముగ్గురు కూడా రోజు తనని పీవీసీ పైపులు, ఇనుప రాడ్లు,
విద్యుత్ వైర్లతో చితకబాదేవారని తెలిపాడు.
నొప్పితో బాధపడుతుంటే వారు ఆనందించేవారని వివరించాడు. శరీరంలోని పక్కటెముకలు కూడా విరిగాయని తెలిపాడు. ఇంటి పని మెత్తం తనతోనే చేయించుకోవడంతో పాటు వెంకటేశ్ రెడ్డి అనే యువకుడు నిత్యం మసాజ్ చేయించుకునేవాడని తెలిపాడు. రోజు మొత్తంలో కేవలం 3 గంటలే నిద్రకు అనుమతినిచ్చేవారని...మిగిలిన సమయం అంతా కూడా గొడ్డు చాకిరీ చేయించుకునే వారని కన్నీరు మున్నీరయ్యాడు.
వాళ్లు చేసిన పని వల్ల కేవలం 8 నెలల్లో 30 కేజీల బరువు తగ్గానని వివరించాడు. ప్రస్తుతం బాధిత యువకునికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే బాధితుడు వీరి ముగ్గురి వద్దకు ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు అనే విషయం తో పాటు అసలు ఎందుకు చిత్ర హింసలు పెడుతున్నారనేది కూడా తెలియాల్సి ఉంది.
Also read: రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్.. ఆ తర్వాతే ఫలితాల ప్రకటన..!!