UK: పీరియడ్స్ నొప్పి భరించలేక...గర్భనిరోధక మాత్రలు వేసుకున్న బాలిక..ఎంత పనైంది..!!

పీరియడ్స్ నొప్పి భరించలేక 16ఏళ్ల అమ్మాయి గర్భనిరోధక మాత్రలు వేసుకుంది. కడుపు నొప్పి, వాంతులు కావడంతో ఆసుపత్రికి వెళ్లింది. పరిస్థితి విషమించి..బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టింది. అపరేషన్ చేసిన 2 రోజులకు బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఈ ఘటన యూకేలో జరిగింది.

New Update
UK: పీరియడ్స్ నొప్పి భరించలేక...గర్భనిరోధక మాత్రలు వేసుకున్న బాలిక..ఎంత పనైంది..!!

16ఏళ్ల బాలిక పీరియడ్స్ లో తీవ్ర కడుపు నొప్పితో బాధపడింది. పీరియడ్స్ నొప్పి భరించలేక...ఉపశమనం పొందే మార్గం ఏదైనా ఉందా అని ఆలోచించింది. తనకు విపరీతమైన నొప్పి ఉన్నట్లు తనకు స్నేహితులకు చెప్పింది. గర్భనిరోధక మాత్రలు వేసుకుంటే తగ్గుతుందని ఆ బాలికకు వారి స్నేహితులు సూచించారు.ద దీంతో ఆ బాలిక నిజంగానే వాటిని కొన్నిరోజులపాటు వేసుకుంది. అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురైంది. లండన్ కు చెందిన 16ఏళ్ల లైలా ఖాన్ తన స్నేహితుల సూచనతో నవంబర్ 15వ తేదీ నుంచి కాంట్రసెప్టివ్ అనే పిల్స్ వేసుకుంది. ఈ ట్యాబ్లెట్లు తీసుకున్న 10 రోజులకు లైలా ఖాన్ తీవ్ర అనారోగ్యానికి గురైంది. వాంతులు, కడుపు నొప్పి మరింత ఎక్కువైంది. దీంతో కుటుంబ సభ్యులను ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె కడుపుతో ఫుడ్ ఇన్ఫెక్షన్ అయినట్లు వైద్యులు అనుమానించారు.

చికిత్స చేసి ఇంటికి పంపించారు. ఆమె ఆరోగ్యం కుదుటపడితే సరే...లేదంటే ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని సూచించారు. ఆమె డిశ్చార్జీ అయిన రోజు రాత్రే లైలాఖాన్ మరోసారి అనారోగ్యం బారిన పడింది. వాంతులు రావడంతో ఆమె బాత్రూమ్ కు వెళ్లింది. అక్కడే కుప్పకూలిపడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు. సిటీ స్కాన్ తీసి...బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. డిసెంబర్ 13వ తేదీన ఆమెకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెక్ అయ్యింది. భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఆపరేషన్ జరిగిన 2 రోజులకే లైలాఖాన్ ప్రాణాలు కోల్పోయింది. ఆమె బ్రెయిడ్ డెడ్ అయ్యిందని వైద్యులు చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అయితే ప్రొఫెసర్లు మాత్రం లైలాఖాన్ ను ఆక్స్ ఫర్డ్ విద్యార్థినిగా పరిగణించారని..పేర్కొంది. పుట్టేడు దుఖాన్ని దిగమింగుకుని ఆ కుటుంబం లైలా ఖాన్ అవయవాలను దానం చేసింది. క్రిస్మస్ ముందు లైలా అవయావాలు ఐదుగురు జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయని సంతోషించారు. తాను చనిపోతూ లైలాఖాన్ ఐదుగురు జీవితాలకు కొత్త వెలుగునిచ్చింది.

ఇది కూడా చదవండి:  డోనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్…అధ్యక్ష పదవికి అనర్హుడని ప్రకటించిన కోర్టు…!!

Advertisment
తాజా కథనాలు