Depression : ఈ ఆహారాలన్నీ డిప్రెషన్‌కు కారణం.. షాకింగ్ సర్వే!

రొట్టెలు, బిస్కెట్లు, కార్బోనేటేడ్ పానీయాలు, ప్యాకేజ్డ్ చిప్స్, స్నాక్స్, స్వీట్లు లాంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ వల్ల ఊబకాయం లాంటి శారీరక సమస్యలతో పాటు.. మానసిక సమస్యలైన ఒత్తిడి, డిప్రెషన్‌ కూడా పెరుగుతాయని అమెరికన్ ఎన్జీవో సేపియన్ ల్యాబ్స్ సర్వే హెచ్చరిస్తోంది.

New Update
Depression : ఈ ఆహారాలన్నీ డిప్రెషన్‌కు కారణం.. షాకింగ్ సర్వే!

Ultra Processed Foods : ఈ రోజుల్లో ఒత్తిడి(Stress) ప్రధాన సమస్యగా మారింది. చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మన దైనందిన జీవితంలో వివిధ కారకాలు ఒత్తిడికి కారణమవుతాయని మనం భావిస్తాం కానీ మనం తీసుకునే ఆహారం కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఎక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల నిరాశ లేదా డిప్రెషన్‌(Depression) ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఊబకాయానికి కారణం:

  • అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్(Ultra Processed Foods) లేదా హై ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆరోగ్యానికి హానికరమని, ఈ రకమైన ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది శరీరంలో ఎసిడిటీ, ఊబకాయానికి కారణమవుతుంది.. అంతేకాదు ఇది మన మానసిక ఆరోగ్యాన్ని కూడా మరింత దిగజార్చుతుంది.

ఎక్కువ తింటే అంతే:

  • అమెరికన్ ఎన్జీవో సేపియన్ ల్యాబ్స్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇందులో 26 దేశాల్లోని ప్రతి వయసు వారు 3 లక్షల మంది ఉన్నారు. ఈ సర్వేలో భారత్(India) నుంచి 30 వేల మందిని చేర్చారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ రోజుకు ఎక్కువ సార్లు తినేవారికి మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు. మానసిక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం నిరాశను పెంచుతుంది. ఈ ఆహారం మన మెదడు, శరీరాన్ని దెబ్బ తీస్తుంది. ఇది మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి తాజా పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, గింజలు, వివిధ రకాల విత్తనాలు తినాలి. ఈ ఆహారాలలో ఒమేగా ఫ్యాటీ -3 ఆమ్లాలు, విటమిన్ -ఇ ఉంటాయి. ఇవి మెదడును ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ :

  • అధిక ప్రాసెస్డ్ పద్ధతిలో తయారు చేసిన ఆహారాలను అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు. ఈ ఆహారాలలో రొట్టెలు, బిస్కెట్లు, కార్బోనేటేడ్ పానీయాలు, ప్యాకేజ్డ్ చిప్స్, స్నాక్స్, స్వీట్లు, వివిధ జంక్ ఫుడ్స్ ఉన్నాయి. ఈ ఆహారాలన్నీ ప్రస్తుత జీవనశైలిలో భాగమైపోయాయి. అలాంటి పరిస్థితిలో, సాధ్యమైనంత వరకు అధిక ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. లేదంటే మన మానసిక ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: బెండకాయ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు.. తెలుసుకుంటే షాక్‌ అవుతారు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

    

Advertisment
తాజా కథనాలు