జెలెన్‌స్కీ దెబ్బకు పుతిన్‌కు మైండ్‌ బ్లాక్‌..మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు..!!

రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ దాడి కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం డ్రోన్లు మాస్కోలోని రెండు భవనాలపై దాడులు చేశారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం వాటిని కూల్చివేసాయి.

జెలెన్‌స్కీ దెబ్బకు పుతిన్‌కు మైండ్‌ బ్లాక్‌..మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు..!!
New Update

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. మాస్కోలోని రెండు భవనాలను ఉక్రెయిన్ దళాలు గత రాత్రి లక్ష్యంగా చేసుకున్నాయి. ఆదివారం ఉదయం రెండు భవనాలపై డ్రోన్లు దాడి చేశాయి. వెంటనే అప్రమత్తమైన సైన్యం వాటిని కూల్చివేశాయి. అయితే ఈ దాడిలో ఇప్పటి వరకు ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. గత రాత్రి ఉక్రెయిన్ జరిపిన దాడిలో మాస్కోలోని రెండు భవనాలు దెబ్బతిన్నాయని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. ఈ దాడిలో రెండు కార్యాలయ టవర్లకు కొంత నష్టం వాటిల్లింది. దాడి నేపథ్యంలో మాస్కోలోని వ్నుకోవో విమానాశ్రయాన్ని మూసివేశారు. అలాగే ఇక్కడి నుంచి వెళ్లే విమానాలను దారి మళ్లించారు.

ఈ నెలలో జరిగిన ఇలాంటి డ్రోన్ల దాడుల వల్ల విమానాశ్రయంలో రాకపోకలకు తీవ్రఅంతరాయం ఏర్పడింది. ఉక్రెయిన్‌కు చెందిన ఐదు డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా గతంలో పేర్కొంది. నాటో మిత్రదేశాలు, అమెరికా సహాయం లేకుండా ఇటువంటి దాడులు సాధ్యం కాదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. US, NATO మిత్రదేశాలు కీవ్ పాలనకు సహాయం చేస్తున్నాయని ఆరోపించారు. శుక్రవారం, ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న దక్షిణ రోస్టోవ్ ప్రాంతంలో రెండు ఉక్రెయిన్ క్షిపణులను అడ్డుకున్నట్లు రష్యా తెలిపింది. ఇందులో టాగన్‌రోగ్ నగరంపై శిథిలాలు పడటంతో సుమారు 16 మంది గాయపడినట్లు వెల్లడించింది.

ఉక్రెయిన్‌లో శాంతికి ఆఫ్రికన్ చొరవ ప్రాతిపదిక కాగలదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం అన్నారు. కానీ ఉక్రేనియన్ దండయాత్ర సమస్యను క్లిష్టతరం చేస్తోందన్నారు. పుతిన్ శుక్రవారం పిట్స్‌బర్గ్‌లో ఆఫ్రికన్ నేతలను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి కొన్ని రోజుల ముందు, ఉక్రెయిన్ సైన్యం రాత్రిపూట 2 రాకెట్లను పేల్చిందని, ఈ రాకెట్లు ఉక్రెయిన్ కు అమెరికా సరఫరా చేసినవని రష్యా ఆరోపించింది. ఈ రెండు రాకెట్లను చమురు, ఆర్డినెన్స్ డిపోలపై ప్రయోగించారు. దీని తర్వాత, కాసేపటికి అనేక పేలుళ్లు సంభవించిన రష్యా పేర్కొంది.

#ukraine #russia-ukraine-war #drone-strike
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe