UGC : ఇక నుంచి నాలుగేళ్ల డిగ్రీతో పీహెచ్‌డీ!

పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. నాలుగేళ్ల డిగ్రీతో ఇక నుంచి నేరుగా యూజీసీ నెట్‌ పరీక్ష రాసి పీహెచ్‌డీ చేయోచ్చని పేర్కొంది. డిగ్రీలో సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఏ అంశంలో కావాలంటే ఆ అంశంలో పీహెచ్ డీ చేయోచ్చని యూజీసీ ప్రకటించింది.

UGC : ఇక నుంచి నాలుగేళ్ల డిగ్రీతో పీహెచ్‌డీ!
New Update

PHD :  పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(University Grants Commission) ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. నాలుగేళ్ల డిగ్రీ(Four Years Degree) తో ఇక నుంచి నేరుగా యూజీసీ నెట్‌ పరీక్ష రాసి పీహెచ్‌డీ చేయోచ్చని పేర్కొంది. ఈ పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీలో సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఏ అంశంలో కావాలంటే ఆ అంశంలో పీహెచ్ డీ చేయోచ్చని యూజీసీ ప్రకటించింది.

జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(Junior Research Fellowship) ఉన్నా.. లేకపోయినా కూడా పీహెచ్‌డీ చేసేందుకు నాలుగేళ్ల డిగ్రీలో కనీసం 75 శాతం మార్కులు ఉండాలని లేకపోతే తత్సమాన గ్రేడ్‌ ఉంటే చాలని యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌(Jagadeesh Kumar) ప్రకటించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ , దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర వర్గాలకు చెందిన వారికి 5శాతం మార్కులలో సడలింపు ఉంటుందని వివరించారు.

యూజీసీ నెట్‌(UGC NET) సెషన్‌ పరీక్షలో ఈ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకుని వస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం నాలుగేళ్ల డిగ్రీ కోర్సు ఎనిమిదో సెమిస్టర్‌లో ఉన్న విద్యార్థులు సైతం యూజీసీ నెట్‌‌కు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభమైందని పేర్కొన్నారు.

Also read: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థులు దుర్మరణం

#phd #degree #ugc-net
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి