UGC: ఆ డిగ్రీలు చేస్తున్న వారికి యూజీసీ అలర్ట్.. గుర్తింపు లేదని ప్రకటన..!! యూజీసీ ద్వారా గుర్తింపు పొందని విదేశీ యూనివర్సిటీల సహకారంతో డిగ్రీలు అందిస్తున్న ఎడెక్ట్ కంపెనీలు, కాలేజీలకు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ చేసింది. ఈ డిగ్రీలు చెల్లవని యూజీసీ తేల్చి చెప్పింది. ఇలాంటి ప్రొగ్రామ్స్ తో భవిష్యత్ ఉపాధి అవకాశాలకు ప్రమాదం తప్పదని హెచ్చరించింది. By Bhoomi 18 Dec 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి UGC: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందని విశ్వవిద్యాలయాల సహాకారంతో డిగ్రీలు అందిస్తున్న ఎడ్డెక్ కంపెనీలు, కాలేజీలకు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ చేసింది. ఈ డిగ్రీలు చెల్లవని యూజీసీ పేర్కొంది. విద్యార్థులు అప్రమత్తంగా ఉండలంటూ సూచించారు. అలాంటి ప్రోగ్రామ్స్ లో నమోదు చేసుకోవడం వల్ల భవిష్యత్ ఉపాధి అవకాశాలకు ప్రమాదం వాటిల్లే ఛాన్స్ ఉంది. గుర్తించని విశ్వవిద్యాలయాలు: ఆన్ లైన్ డిగ్రీలకు అందించే ఎన్నో సంస్థలు యూజీసీ (UGC) గుర్తింపు లేవు. మనదేశంలో వాటికి విలువ ఉండదు. సహకారం ఉండదు: ఇలాంటి ఫ్రాంచైజీ ఏర్పాట్లునేవి చట్టవిరుద్దమైనవి. ప్రోగ్రామ్స్ లేదా డిగ్రీలు యూజీసీచే గుర్తించబడవు. ఉల్లంఘించిన వారిపై చర్యలు: ఎడ్టెక్ కంపెనీలు పాల్గొనే హెచ్ఈఐలు రెండూ చెల్లని ప్రోగ్రామ్స్ ను అందిస్తే వాటిపై చర్యలు తీసుకుంటారు. యూనివర్సిటీ గుర్తింపు: ఏదైనా ఆన్ లైన్ డిగ్రీ ప్రోగ్రామ్ లో నమోదు చేసుకునే ముందు విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలి. యూనివర్సిటీల గుర్తింపును తప్పని సరిగా ధ్రువీకరించాలని యూజీసీ కోరింది. ఏదైనా ఆన్ లైన్ డిగ్రీ ప్రోగ్రామ్ లో నమోదు చేసుకునే ముందు యూనివర్సిటీ గుర్తింపు పొందిందని నిర్ధారించుకునేందుకు యూజీసీ వెబ్ సైట్ ను చెక్ చేసుకోండి. ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలి: కొన్ని ఎడ్టెక్ కంపెనీలు గుర్తింపు లేని విదేశీ యూనివర్సిటీలతో కలిసి ఆన్ లైన్ డిగ్రీ, డిప్లొమా ప్రోగ్రామ్స్ ను తప్పుగా ప్రచారం చేస్తున్నాయి. ఎడ్టెక్ కంపెనీలు ఆకర్షించే ఆఫర్ లకు పొంగిపోకండి. సమయం, డబ్బు, పెట్టుబడిపెట్టేందుకు ముందుగా పూర్తిగా సెర్చ్ చేయండి. భవిష్యత్తును కాపాడుకోవాలి: మీ విద్య, కెరీర్ అవకాశాలను కాపాడుకోవడానికి గుర్తింపు పొందిన సంస్థలు ప్రోగ్రామ్స్ ను సెలక్ట్ చేసుకోండి. ఆన్ లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ను పరిగణలోకి తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని యూజీసీ కోరింది. చెల్లని అర్హతలతో మీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టకండి. ఇది కూడా చదవండి: మద్యం మత్తులో ఎమ్మార్వో కుమారుడి డ్రైవింగ్…యువకుడు మృతి హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTU) ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2022-23 విద్యా సంవత్సరం విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలుపుతున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసిన యాజమాన్యం.. డిప్లొమా పూర్తిచేసిన ఇంజినీరింగ్ విద్యార్థులకు 23 మార్కులు, ఫైనల్ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కానీ వాళ్లకు 30 మార్కులు కలపబోతున్నట్లు తెలిపారు. గంలోనూ కరోనా సమయంలో విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపామని, ఈసారి కూడా విద్యార్థుల విజ్ఞప్తి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. అలాగే ఇంజినీరింగ్‌లోని అన్ని విభాగాల డీన్‌లతో చర్చింని తర్వాత దీనిపై ఫైనల్ నిర్ణయం తీసుకున్నామని, తక్షణమే ఇది ఆచరణలోకి వస్తుందని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఉద్యోగాలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, డిగ్రీ పర్సంటేజీలకు సంబంధించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ సడలింపు ఇవ్వబడిందని స్పష్టం చేశారు. సబ్జెక్ట్ మినహాయింపు ఎందుకు ఇవ్వలేదో వివరిస్తూ ఒక సబ్జెక్ట్ మినహాయింపు ఇస్తే, మెమోలో ‘క్లియర్ చేయని సబ్జెక్ట్‌లు’ అని స్పష్టంగా పేర్కొనబడుతుందని అన్నారు. అయితే గ్రేస్ మార్కులు పెంచుతూ యూనివర్సిటీ అధికారులు తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇక నవంబర్ 20వ తేదీన విద్యార్థులు క్రెడిట్ ఆధారిత నిర్బంధ విధానాన్ని సడలించాలని కోరుతూ క్యాంపస్‌లో ధర్నాకు దిగారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) విద్యార్థి విభాగం, యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) తెలంగాణ నుంచి విద్యార్థులకు మద్దతు లభించింది. అయితే తాజాగా యూనివర్సీటీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన NSUI తెలంగాణ ప్రెసిడెంట్ వెంకట్ బల్మూర్ ‘JNTUH వైస్ ఛాన్సలర్‌తో సమావేశం జరిగింది. సబ్జెక్ట్, క్రెడిట్ మినహాయింపు కోసం డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు 30 గ్రేస్ మార్కులు ఇస్తామని వైస్ ఛాన్సలర్ హామీ ఇచ్చారు. JNTU తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని ట్విట్టర్ వేదికగా విషయాన్ని షేర్ చేశారు. #ugc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి