UFO vs Rafale: మణిపుర్(Manipur) రాష్ట్రంలోని ఇంఫాల్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం(Imphal Airport) దగ్గర్లో UFO ను పోలిన గుర్తు తెలియని వస్తువు గాల్లో ఎగరడం తీవ్ర కలకలం రేపింది. అయితే, ఈ గుర్తు తెలియని వస్తువును పట్టుకునేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. అత్యాధునికమైన రెండు రాఫెల్ ఫైటర్ జెట్ల(Rafale fighter jets)తో వేట సాగించింది. అంతుపట్టని ఆ వస్తువును గుర్తించేందుకు తీవ్రంగా గాలించింది. అయితే, రాఫెల్ జెట్లకు ఆ వస్తువు చిక్కలేదు. ఎక్కడా అనుమానాస్పద వస్తువు కన్పించకపోవడంతో యుద్ధ విమానాలు రిటర్న్ అయ్యాయి. ఈ విషయాన్ని భారత రక్షణశాఖ అధికారులు వెల్లడించారు.
అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంఫాల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ గుర్తుతెలియని ఎగిరే వస్తువు(యూఎఫ్‌ఓని పోలిన వస్తువు) కనిపించింది. ఇది గమనించిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది.. ఏటీసీకి సమాచారం అందించింది. దీంతో అలర్ట్ అయిన ఏటీసీ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంఫాల్ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నిలిపివేసింది. అదే సమయంలో ఈ వింత వస్తువు ఏంటో తెలుసుకుకనేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెండు రాఫెల్ జెట్లను రంగంలోకి దింపింది.
సమీపంలోని ఎయిర్‌బేస్ నుంచి తొలత ఒక రాఫెల్ ఫైటర్ జెట్‌ను పంపించారు అధికారులు. అనుమానిత ప్రాంతం మొత్తం జల్లెడ పట్టారు. కానీ, ఎక్కడ ఆ వస్తువు కనిపించలేదు. దాంతో.. ఆ యుద్ధ విమానం రిటర్న్ అయ్యింది. మరికాసేపటికే మరో విమానంతో గాలించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎలాంటి అనుమానాస్పద వస్తువును రాఫెల్ గుర్తించలేకపోయింది. కాగా, ఈ ఘటన నేపథ్యంలో ఇంఫాల్ ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజమ్‌ను యాక్టివేట్ చేసినట్లు ఐఏఫ్ ఈస్ట్రన్ కమాండర్ వెల్లడించారు.
Also Read:
నిరుద్యోగులకు కేటీఆర్ సంచలన హామీ.. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే..
ఆ ఒక్కడికీ తప్ప అందరికీ రెస్ట్.. ఆసిస్ తో టీ20 సిరీస్ కెప్టెన్ గా సూర్య!