UFO vs Rafale: యూఎఫ్ఓని పట్టుకునేందుకు రాఫెల్స్ వేట.. చివరకు ఏమైందంటే..! మణిపూర్ రాజధాని ఇంఫాల్ ఎయిర్‌పోర్టు వద్ద UFOని పోలిన వస్తువు గాల్లో ఎగరడం కలకలం రేపింది. దానిని గుర్తించి పట్టుకునేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రాఫెల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. రెండు రాఫెల్ జెట్స్ సెర్చ్ చేసినా అది చిక్కలేదు. By Shiva.K 21 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి UFO vs Rafale: మణిపుర్(Manipur) రాష్ట్రంలోని ఇంఫాల్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం(Imphal Airport) దగ్గర్లో UFO ను పోలిన గుర్తు తెలియని వస్తువు గాల్లో ఎగరడం తీవ్ర కలకలం రేపింది. అయితే, ఈ గుర్తు తెలియని వస్తువును పట్టుకునేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. అత్యాధునికమైన రెండు రాఫెల్ ఫైటర్ జెట్ల(Rafale fighter jets)తో వేట సాగించింది. అంతుపట్టని ఆ వస్తువును గుర్తించేందుకు తీవ్రంగా గాలించింది. అయితే, రాఫెల్ జెట్లకు ఆ వస్తువు చిక్కలేదు. ఎక్కడా అనుమానాస్పద వస్తువు కన్పించకపోవడంతో యుద్ధ విమానాలు రిటర్న్ అయ్యాయి. ఈ విషయాన్ని భారత రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంఫాల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ గుర్తుతెలియని ఎగిరే వస్తువు(యూఎఫ్‌ఓని పోలిన వస్తువు) కనిపించింది. ఇది గమనించిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది.. ఏటీసీకి సమాచారం అందించింది. దీంతో అలర్ట్ అయిన ఏటీసీ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంఫాల్ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నిలిపివేసింది. అదే సమయంలో ఈ వింత వస్తువు ఏంటో తెలుసుకుకనేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెండు రాఫెల్ జెట్లను రంగంలోకి దింపింది. Indian Air Force scrambled 2 Rafale fighter jets to search for 'UFO' sighted near Imphal. Consequently, Indigo flight, Kolkata to Imphal, was instructed to hold overhead till clearance is taken from security Agencies, CISF & SP Imphal West. Another flight ✈️diverted to Guwahati pic.twitter.com/96gLIOaX28 — Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) November 20, 2023 సమీపంలోని ఎయిర్‌బేస్ నుంచి తొలత ఒక రాఫెల్ ఫైటర్ జెట్‌ను పంపించారు అధికారులు. అనుమానిత ప్రాంతం మొత్తం జల్లెడ పట్టారు. కానీ, ఎక్కడ ఆ వస్తువు కనిపించలేదు. దాంతో.. ఆ యుద్ధ విమానం రిటర్న్ అయ్యింది. మరికాసేపటికే మరో విమానంతో గాలించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎలాంటి అనుమానాస్పద వస్తువును రాఫెల్ గుర్తించలేకపోయింది. కాగా, ఈ ఘటన నేపథ్యంలో ఇంఫాల్ ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజమ్‌ను యాక్టివేట్ చేసినట్లు ఐఏఫ్ ఈస్ట్రన్ కమాండర్ వెల్లడించారు. UFO sighting yesterday at the Imphal airport in India after which airport was shutdown. Investigations underway. Some say it could be a commercially brought drone being operated by an individual near the airport. pic.twitter.com/dBVfj1pB43 — Aditya Raj Kaul (@AdityaRajKaul) November 20, 2023 Also Read: నిరుద్యోగులకు కేటీఆర్ సంచలన హామీ.. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే.. ఆ ఒక్కడికీ తప్ప అందరికీ రెస్ట్.. ఆసిస్ తో టీ20 సిరీస్ కెప్టెన్ గా సూర్య! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి