Mumbai : ఫేస్‌బుక్‌ లైవ్‌లో మర్డర్.. కార్పోరేటర్ ను కాల్చి చంపిన ఉద్యమకారుడు

శివసేన నేత దారుణ హత్యకు గురయ్యారు. మాజీ కార్పోరేటర్ అభిషేక్ ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతుండగా స్థానిక ఉద్యమకారుడు మౌరిస్‌ నోరాన్హ కాల్పులు జరిపాడు. అభిషేక్ చికిత్సపొందుతూ మరణించారు. మౌరిస్ తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

New Update
Mumbai : ఫేస్‌బుక్‌ లైవ్‌లో మర్డర్.. కార్పోరేటర్ ను కాల్చి చంపిన ఉద్యమకారుడు

MURDER : ముంబై లో శివసేన నేత(Shiv Sena UBT) దారుణ హత్య(Murder) కు గురయ్యారు. ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన మాజీ కార్పోరేటర్ అభిషేక్‌ (Abhishek) ఫేస్ బుక్ లో లైవ్ లో మాట్లాడుతుండగా స్థానిక ఉద్యమకారుడిగా పేరుగాంచిన ఓ వ్యక్తి కాల్చి చంపాడు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండగా ఈ భయంకరమైన సంఘటన ముంబై రాజకీయాలను కుదిపేస్తుంది.

మాజీ కార్పోరేటర్..
ఈ మేరకు ముంబై(Mumbai) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివసేన (యూబీటీ) వర్గానికి చెందిన అభిషేక్‌ ఘోసాల్కర్‌ మాజీ కార్పోరేటర్. అతడి తండ్రి వినోద్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడిగా సేవలందిస్తున్నారు. అయితే స్థానికంగా ఉంటున్న సామాజిక కార్యకర్త ఉద్యమకారుడైన మౌరిస్‌ నోరాన్హ.. అభిషేక్‌ల మధ్య కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ముంబైలోని బొరివిల్లీ ప్రాంతంలోని ఐసీ కాలనీ అభివృద్ధి పనుల కోసం మాట్లాడుకోవడానికి నోరాన్హ తన కార్యాలయానికి అభిషేక్‌ను ఆహ్వానించాడు. అక్కడికి వెళ్లిన అభిషేక్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌(Facebook Live Murder) లో మాట్లాడుతుండగా నోరాన్హ తుపాకీతో కాల్చాడు. భుజంలోకి తూటాలు దూసుకెళ్లడంతో అభిషేక్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అభిషేక్‌ను ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇది కూడా చదవండి :Nirmal: హాస్టల్ లో కొట్టుకున్న విద్యార్థులు.. ఒకరు మృతి

నిందితులు ఆత్మహత్య..
అయితే ఈ దారుణానికి పాల్పడ్డ నోరాన్హ.. అక్కడే తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇక ఇందుకు సంబంధించిన కాల్పుల ఘటన అంతా ఫేస్‌బుక్‌ లైవ్‌లో రికార్డు అయింది. ఈ ఘటనపై సీఎం ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde) విచారణకు ఆదేశించగా, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ వెంటనే రాజీనామా చేయాలంటూ ఎంపీ సంజయ్‌ రౌత్‌ డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలు కరవయ్యాయని మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే విమర్శించారు.

Advertisment
తాజా కథనాలు